AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Motors: మరింత ప్రియం కానున్న టాటా, హోండా, రెనో వాహనాలు..! ఎప్పటి నుంచి అంటే..

పలు వాహన కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచనున్నాయి. చిప్స్ కొరత, ముడి పదార్థాల వ్యయాలు అధికమవుతున్నందున, వాహన ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు రెడీ అవుతున్నాయి....

TATA Motors: మరింత ప్రియం కానున్న టాటా, హోండా, రెనో వాహనాలు..! ఎప్పటి నుంచి అంటే..
ఈ సెమీకండక్టర్ల అసెంబ్లింగ్‌ రంగంకు సంబంధించి ప్లాంట్‌ గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కూడా సాగినట్లు సమాచారం. డిసెంబర్‌లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Srinivas Chekkilla
|

Updated on: Dec 06, 2021 | 7:46 AM

Share

పలు వాహన కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచనున్నాయి. చిప్స్ కొరత, ముడి పదార్థాల వ్యయాలు అధికమవుతున్నందున, వాహన ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు కార్ల ధరల్ని జనవరి 1 నుంచి పెంచుతున్నామని ప్రకటించగా, టాటా మోటార్స్‌, హోండా, రెనో సంస్థలు కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి.

‘కమొడిటీలు, ముడి పదార్థాల ధరలు పెరిగినందున, కంపెనీపై పడుతున్న భారంలో కొంతైనా వినియోగదార్లకు సమీప భవిష్యత్తులో బదిలీ చేస్తామ’ని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర చెప్పారు.

హోండా కార్స్‌ ఇండియా కూడా సమీప భవిష్యత్‌లో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సంస్థ గత ఆగస్టులో ఒకసారి ధరలు పెంచింది. క్విడ్‌, ట్రైబర్‌, కైజర్‌ వాహనాలను దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్రెంచ్‌ కంపెనీ రెనో కూడా జనవరి నుంచి వాహన ధరలు పెంచాలనుకుంటున్నట్లు సమాచారం. కరోనా తర్వాత ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బతకలేని పరిస్థితి తలెత్తింది.

Read Also.. Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.5 వేలు..!