Stock Market: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు.. మార్కెట్ ఎలా ఉండబోతుంది..?
దిగువ స్థాయుల్లో కొనుగోళ్లతో గత వారం మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. సానుకూల అంశాలు మార్కెట్ లాభాలకు కారణమయ్యాయి. జులై-సెప్టెంబరులో జీడీపీ 8.4 శాతానికి పెరగడం, జీఎస్‌టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లు దాటడం మార్కెట్ కు కలిసొచ్చింది.
దిగువ స్థాయుల్లో కొనుగోళ్లతో గత వారం మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. సానుకూల అంశాలు మార్కెట్ లాభాలకు కారణమయ్యాయి. జులై-సెప్టెంబరులో జీడీపీ 8.4 శాతానికి పెరగడం, జీఎస్‌టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లు దాటడం మార్కెట్ కు కలిసొచ్చింది. అయితే దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకావడంతో మార్కెట్ల లాభాల జోరుకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. దేశ ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 2,327 కోట్ల డాలర్లకు చేరింది.
కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ పరిణామాల వల్ల గిరాకీ మళ్లీ తగ్గొచ్చనే అంచనాలతో, వరుసగా రెండో వారం చమురు ధరలు తగ్గి, బ్యారెల్ 69.9 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.3 శాతం తగ్గి 75.1 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల్లో తాజా లాక్‌డౌన్‌లు, ప్రయాణ ఆంక్షలు విధించడంతో ప్రపంచ మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే గత వారం సెన్సెక్స్ 1 శాతం లాభంతో 57,696 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1 శాతం పెరిగి 17,196 పాయింట్ల దగ్గర ఉన్నాయి. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాల షేర్లు గత వారం లాభాల్లో ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్ స్క్రిప్‌లు నష్టాలను చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే దేశీయ సూచీల ఈ వారం ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన నెలకొంది. అయితే మార్కెట్ నష్టపోయినప్పుడు కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించే అవకాశం ఉంది. స్టార్ హెల్త్ షేర్లు 10న స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కానుంది.
Read Also… LIC IPO: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు 10 శాతం రిజర్వ్..