Tata Group: స్టాక్ మార్కెట్‎లో దూసుకెళ్తున్న టాటా గ్రూప్ షేర్లు.. కారణం అదేనా..

స్టాక్ మార్కెట్‎లో టాటా కంపెనీల షేర్లు బాగా పెరుగుతున్నాయి. టాటా ఎయిర్‌ ఇండియా బిడ్‌ గెలుచుకున్నాక.. టాటా చెందిన వివిధ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. టాటా మోటర్స్ గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోంది...

Tata Group: స్టాక్ మార్కెట్‎లో దూసుకెళ్తున్న టాటా గ్రూప్ షేర్లు.. కారణం అదేనా..
Tata
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 12, 2021 | 10:13 PM

స్టాక్ మార్కెట్‎లో టాటా కంపెనీల షేర్లు బాగా పెరుగుతున్నాయి. టాటా ఎయిర్‌ ఇండియా బిడ్‌ గెలుచుకున్నాక.. టాటా చెందిన వివిధ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. టాటా మోటర్స్ గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోంది. టైటాన్, వోల్టాస్, టాటా ఎలెక్సీ, ఇండియన్ హోటల్స్ గత శుక్రవారం ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. టాటా పవర్ షేరు కూడా పెరుగుతూ వస్తోంది.

టాటా గ్రూప్‎లో ప్రధానమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్‌… సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రటించింది. దీంతో టీసీఎస్ షేరు ధర రికార్డు స్థాయిలో రూ. 3,990 ను టచ్‌ చేసింది. కానీ ఈ రోజు కాస్త తగ్గింది. టాటా మోటార్స్ విద్యుత్తు వాహనాల విభాగంలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్లు దూసుకెళ్లుతున్నాయి.

టైటాన్ మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లు దాటింది. టాటా గ్రూప్‌లో టీసీఎస్ తర్వాత రెండు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ దాటిన కంపెనీ ఇది. టైటానా ఈరోజు కూడా 5 శాతంపై వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతం టాటా ఎలెక్సీ 6073.10, టీసీఎస్ 3653.90, టైటాన్ 2494.35, టాటా మోటర్స్ 420, టాటా పవర్ 195, టాటా స్టీల్ షేర్ విలువ 87 రూపాయిలుగా ఉంది.

Read Also.. Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..