TAT iPhone: ఒకే ఒక్క అడుగు దూరంలో ‘టాటా’.. అదే జరిగితే తొలి ఇండియా మేడ్ ఐఫోన్..
ఐఫోన్.. మేడ్ బై టాటా. అవును, టాటా మేడ్ ఐఫోన్ అతిత్వరలోనే రాబోతోంది. టాటా ప్లాంట్‌లో ఐఫోన్ తయారీ కానుంది. అందుకు వేగంగా అడుగులేస్తోంది టాటా గ్రూప్. యాపిల్‌తో బంధాన్ని పటిష్టం చేసుకుంటోంది టాటా గ్రూప్.
ఐఫోన్.. మేడ్ బై టాటా. అవును, టాటా మేడ్ ఐఫోన్ అతిత్వరలోనే రాబోతోంది. టాటా ప్లాంట్‌లో ఐఫోన్ తయారీ కానుంది. అందుకు వేగంగా అడుగులేస్తోంది టాటా గ్రూప్. యాపిల్‌తో బంధాన్ని పటిష్టం చేసుకుంటోంది టాటా గ్రూప్. ఇప్పటికే హోసూర్‌లో ఐఫోన్ స్పేర్ పార్ట్స్‌ను తయారు చేస్తోన్న టాటా.. ఇప్పుడు ఐఫోన్లను తయారు చేయాలనుకుంటోంది. అందుకోసం ఐఫోన్ మేకింగ్ ప్లాంట్‌ను చేజిక్కించుకునేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరులోని విస్ట్రోన్ కంపెనీ ఐఫోన్ మేకింగ్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది టాటా గ్రూప్.
భారత్‌తో ఐఫోన్లు తయారవుతున్నా, విదేశీ కంపెనీల చేతుల్లోనే ప్లాంట్స్ ఉన్నాయ్. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ కంపెనీలు.. భారత్‌లో ప్లాంట్స్ ఏర్పాటుచేసి యాపిల్ ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నాయి. అయితే, టాటా గ్రూప్ తొలి దేశీయ ఐఫోన్ తయారీ కంపెనీగా నిలిచేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. తైవాన్ కంపెనీ విస్ట్రోన్‌తో కొన్నాళ్లుగా జరుపుతోన్న చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. బెంగళూరు విస్ట్రోన్ ప్లాంట్‌లో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు ట్రై చేస్తోంది. ఈ మార్చి ఆఖరుకల్లా ప్లాంట్‌ను చేజిక్కించుకోవాలన్నది టాటా గ్రూప్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది సంస్థ.
మార్చి 31 నాటికి టాటా-విస్ట్రోన్ మధ్య చర్చలు కొలిక్కిరానున్నాయ్. డీల్ కంప్లీటైతే ఇకపై భారత్‌లో ఐఫోన్ల తయారీని టాటా ఎలక్ట్రానిక్స్ చేపట్టనుంది. మరోవైపు, దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లను ప్రారంభించబోతోంది టాటా సంస్థ. మొదటి స్టోర్‌ను ముంబైలో ఓపెన్ చేయబోతోంది. మొత్తానికి, మేడ్ బై టాటా ఐఫోన్.. అతిత్వరలోనే రాబోతోందన్నది కన్ఫ్మామ్‌గా వినిపిస్తోన్న మాట. అందుకు తగ్గట్టుగా వేగంగానే అడుగులేస్తోంది టాటా గ్రూప్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..