Food: న్యూ ఇయర్ వేళ రికార్డు స్థాయిలో ఫుడ్ ఆర్డర్లు.. అందులో బిర్యానీదే అగ్రస్థానం..
న్యూ ఇయర్ వేళ ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్‌ల పంట పండింది. ఒమిక్రాన్ భయంతో చాలా మంది ఇళ్లలోనే కొత్త సంవత్సర సంబురాలు జరుపుకున్నారు...
న్యూ ఇయర్ వేళ ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్‌ల పంట పండింది. ఒమిక్రాన్ భయంతో చాలా మంది ఇళ్లలోనే కొత్త సంవత్సర సంబురాలు జరుపుకున్నారు. అయితే ఎప్పుడు ఇంటి భోజనం ఏంటని హోటళ్ల నుంచి తెప్పించుకున్నారు. దీంతో స్విగ్గీ, జోమాటోకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. స్విగ్గీ యాప్‌కు నిమిషానికి 9వేల డెలివరీలు రాగా.. జొమాటోకు నిమిషానికి 8వేల పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయా కంపెనీలు తెలిపాయి.
న్యూ ఇయర్ సందర్భంగా 2 మిలియన్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గతేడాది స్విగ్గీకి నిమిషానికి 5500 ఆర్డర్లు రాగా ఇప్పుడు ఆ సంఖ్య 9049కి పెరిగింది. అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీ అని స్విగ్గీ వెల్లడించింది. నిమిషానికి 1229 బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. చికెన్ బిర్యానీ, బటర్ నాన్, మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌కు అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.
జొమాటోలోనూ ఆర్డర్ల జోరు కొనసాగింది. నూతన సంవత్సరం వేళ ఈ యాప్ నుంచి కూడా 20లక్షలకు పైగా మంది ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్నారని ఆ కంపెనీ తెలిపింది. నిమిషానికి 8000లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఒక రోజులో 20లక్షలకు పైగా ఆర్డర్లు రావడం ఇదే తొలిసారి అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ వేదికగా తెలిపారు.
కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యం సేల్స్ సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగింది.
Read Also.. Elon Musk: మస్క్ నోట శ్రీమంతుడు సినిమా మాట.. ఎంత తీసుకున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాలటా..