Budget SUV’s: మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఎస్‌యూవీలు.. టాప్10 కార్లు ఇవే..!
భారతదేశంలోని ప్రజలకు కారు కొనడం అనేది ఒక ఎమోషన్. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కారు అనేది ఓ స్టేటస్ సింబల్‌లా ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నా ఆ కారు నిర్వహణ విషయం యజమానిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు అధిక మైలేజ్‌ను ఇచ్చే ఎస్‌యూవీలపై ఆసక్తి పెరిగింది. కాబట్టి ప్రస్తుతం మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

దేశంలో ఎస్‌యూవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. వినియోగదారులు హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరకే మెరుగైన ఎస్‌యూవీలు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీలు ఇచ్చే మైలేజ్ కారణంగా వాటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతి సుజుకి, మహీంద్రా & మహీంద్రా, కియా, టయోటా వంటి అనేక కంపెనీలు నాలుగు మీటర్ల కంటే చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నారు. మీరు కొత్త ఎస్‌యూవీ కొనుగోలుకు రూ.8 లక్షల బడ్జెట్ సెట్ చేసుకుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మంచి కార్లపై ఓ లుక్కేద్దాం.
టాటా పంచ్
టాటా మోటార్స్ మినీ ఎస్‌యూవీ పంచ్ గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. టాటా పంచ్ కేవలం రూ. 6 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ కారు మైలేజ్ కూడా లీటర్‌కు దాదాపు 20.09 కి.మీ.గా ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ మోటార్ ఇండియాకు సంబంధించిన చౌకైన ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ప్రస్తుతం రూ. 6.20 లక్షల (ఎక్స్-షోరూమ్)కే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
కియా సోనేట్
కియా ఇండియా ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందింది. కియా రిలీజ్ చేసిన సోనెట్ ప్రస్తుతం రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 18.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
టాటా నెక్సన్
దేశంలోని ఎస్‌యూవీల ప్రియుల ఫస్ట్ ఆప్షన్ టాటా నెక్సాన్. ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ. 8 లక్షలుగా ఉంది. అలాగే ఈ కారు లీటరుకు 17.44 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
స్కోడా కోడియాక్
స్కోడా ఆటో ఇండియా ఇటీవలే సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలోక్‌ను లాంచ్ చేసింది. ఈ కారు దర రూ. 7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), అలాగే మైలేజ్ లీటర్ కు 19.68 కి.మీ ఇస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓ
మహీంద్రా & మహీంద్రాకు సంబంధించిన చౌకైన ఎస్‌యూవీ 3 ఎక్స్ఓ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ కారు లీటరుకు 18.89 కి.మీ. మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఫాక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇటీవలి నెలల్లో బాగా అమ్ముడవుతున్న కార్లల్లో ఒకటిగా ఉంటుంది. ఈ కారు అద్భుతమైన లుక్స్, అద్భుతమైన ఫీచర్లు. ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.52 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్
భారతదేశంలో విక్రయిస్తున్న నిస్సాన్ ఎస్‌యూవీ మాగ్నైట్ తక్కువ ధరకు మంచి మైలేజీతో వస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. రూ. 6.12 లక్షల నుండి ప్రారంభం అవతుంది. ఈ కారు లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
టయోటా టైగర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాకు సంబంధించిన చౌకైన ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ టైగర్ ప్రస్తుతం భారతదేశంలో రూ. 7.74 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఈ కారు లీటర్‌కు 21.7 కి.మీ. మైలేజీని అందిస్తుంది.
రెనాల్ట్ కాంగూ
రెనాల్ట్ ఇండియాకు సంబంధించిన ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్ ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు లీటరుకు 19.17 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి