Maruti Suzuki Baleno: మారుతీ సుజుకీ బాలెనోపై బాదుడు షురూ.. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ
కారు కొనుగోలు చేయడం అనేది ప్రతి మధ్యతరగి ఉద్యోగి కల. కుటుంబం మొత్తం హ్యాపీగా కారులో వెళ్లాలనే ఆశతో పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు కారు లోన్ తీసుకని ఆ కలను నిజం చేసుకుంటారు. కార్ల కొనుగోలు విషయానికి వచ్చేసరికి దేశంలో మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకీ కార్లు మొదటి ఎంపికగా ఉంటాయి. మారుతి సుజుకి బాలెనో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో తనకంటూ ఒక బలమైన ఖ్యాతిని ఏర్పరచుకుంది.

భారతదేశంలో ఎస్‌యూవీలతో పెరుగుతున్న డిమాండ్, ప్రజాదరణ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల సంఖ్య తగ్గిపోతున్నాయి. దీంతో మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ దాని సొంత విభాగంలో కూడా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనో విస్తృతంగా ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంటుంది. అయితే ఈ కారు ధరలు పెరగడంతో టాటా ఆల్టోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా, మారుతీ సుజుకి స్విఫ్ట్ వంటి కార్ల నుంచి పోటీని ఎదుర్కొంటుంది.
నెక్సా ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా విక్రయించే మారుతి సుజుకి బాలెనో ఇటీవల ధరలు బాగా పెరిగాయి. ఈ కారు ధర రూ.9,000 వరకు ఉంది. మారుతి సుజుకి బాలెనోకు సంబంధించిన డెల్టా ఏజీఎస్, జీటా ఎజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ ట్రిమ్ మోడల్స్ రూ.9,000 వరకు పెరిగాయి. గత ధరలతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఇతర వేరియంట్లు ఒక్కొక్కటి రూ.4,000 వరకు పెరిగాయి. అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో మారుతీ సుజుకీ బాలెనోకు పోటినిచ్చే ఇతర కంపెనీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హ్యుందాయ్ ఐ20
హ్యూందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనోకు పోటీగా హ్యుందాయ్ ఐ20 ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో లభించే ఐ20 ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సీవీటీ ఆటోమేటిక్ యూనిట్‌కు సంబంధించిన ట్రాన్స్ మిషన్ ఎంపికలను అందిస్తోంది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్రూఫ్ వంటి లక్షణాలతో వస్తుంది.
టాటా ఆల్టోస్
మారుతి సుజుకి బాలెనోకు ప్రత్యామ్నాయంగా మరో కారు కావాలని కోరుకునే వారికి టాటా ఆల్టోజ్ మంచి ఎంపిక. 1.2-లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్లో నడిచే ఆల్టోజ్ ఐసీఎన్‌జీ వేరియంట్‌ను కూడా పొందుతుంది. ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఈ కారు ప్రత్యేకత. 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు ఎయిర్ బ్యాగ్లు, బ్లైండ్-వ్యూ మానిటర్తో కూడిన 360 డిగ్రీ కెమెరాతో ఆకట్టుకుంటుంది.
టయోటా గ్లాంజా
మారుతి సుజుకి బాలెనోకు మరో ఆసక్తికరమైన ప్రత్యామ్నాయం టయోటా గ్లాంజా ఉంటుంది. ఈ కారు బాలెనోతో సమానమైన అండర్ పిన్నింగ్, ఫీచర్లు, పవర్ ట్రైన్‌తో వస్తుంది. రీబ్యాడ్జ్ చేసిన బాలెనో మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌తో ప్రతిదీ పంచుకున్నప్పటికీ చాలా మంది కస్టమర్లు టయోటా గ్లాంజాను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి