AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooters: మార్కెట్‌లో ఈవీ స్కూటర్ల హవా.. స్టోరేజ్ విషయంలో ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు కచ్చితంగా ఈవీ స్కూటర్ల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈవీ స్కూటర్స్‌లో స్టోరేజ్ విషయంలో ది బెస్ట్ స్కూటర్స్‌పై లుక్కేద్దాం.

EV Scooters: మార్కెట్‌లో ఈవీ స్కూటర్ల హవా.. స్టోరేజ్ విషయంలో ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!
Ev Scooters
Nikhil
|

Updated on: Feb 14, 2025 | 11:51 AM

Share

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌ను మోటర్ సైకిల్స్ విభాగంలో ఐసీఈ మోటార్ సైకిల్స్ శాసిస్తుంటే స్కూటర్ల విభాగాన్ని మాత్రం రెండేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు శాసిస్తున్నాయి. ముఖ్యంగా యుటిలిటీ, విస్తృత శ్రేణి మోడల్స్‌పై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఈవీ స్కూటర్ల కొనుగోలును ఇష్టపడుతున్నారు. అయితే స్కూటర్ల వినియోగం విషయానికి వస్తే నిల్వ సామర్థ్యం వినియోగదారులు పరిశీలిస్తున్నారు. ప్రయాణ ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అనువుగా ఉన్నా కుటుంబంతో బయటకు వెళ్లినప్పుడు వారి లగేజీ మెయిన్‌టెయిన్ చేయడానికి అండర్ సీట్ స్టోరేజీను కొనుగోలుదారులు చూస్తున్నారు. షాపింగ్ బ్యాగులు, ఇతర చిన్న బ్యాగులు, మొబైల్ ఫోన్ ఛార్జర్, ల్యాప్టాప్ మొదలైన వాటిని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ సరిపోయేంత స్థలం ఉన్న స్కూటర్ల కోసం కొనుగోలుదారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో 30 లీటర్ల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యాన్ని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఏథర్ రిజ్టా

ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో విజయం సాధించిన తర్వాత ఏథర్ కంపెనీ రిజ్జాను ఫ్యామిలీ స్కూటర్ పేరుతో రిచయం చేసింది. ఈ ఫ్యామిలీ స్కూటర్ గురించి చెప్పుకుంటే ప్రాక్టికాలిటీ, యుటిలిటీ అంశాలు కొనుగోలు నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏథర్ రిజ్జా 56 లీటర్ల భారీ నిల్వ సామర్థ్యాన్ని అందిస్తోంది. ఇందులో 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంటుంది, అయితే పెద్ద ఫ్రంట్ ఆప్రాన్ కూడా 22 లీటర్ల నిల్వను అందిస్తుంది. ఆథర్ రిజ్జా ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఓలా ఎస్ 1 ప్రో ప్లస్

ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ స్కూటర్ మెరుగైన పనితీరు, భద్రతా లక్షణాలతో ఆకట్టుకుంటుంది. ఓలా ఎస్1 ప్రో ప్లస్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనం ముందు భాగంలో క్యూబీ హెూల్స్‌తో రావడం వల్ల ఫోకస్డ్ స్టోరేజ్ ఎంపికగా వస్తుంది. ఓలా ఎస్1 ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్-షోరూమ్ ) గా ఉంది. 

ఇవి కూడా చదవండి

రివర్ ఇండీ

బెంగళూరుకు చెందిన ఈవీ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్కూటర్ బోల్డ్, దృఢమైన రూపంతో ఆకట్టుకుంటుంది. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే ఇది 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ తో వస్తుంది.  మొత్తం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానికి 55 లీటర్ల నిల్వ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ 

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్లు ఆధిపత్యం చెలాయిస్తుండగా టీవీఎస్ మోటార్ కంపెనీ వంటి లెగసీ కంపెనీలు కూడా తమ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ ఈ విభాగంలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది. ఈ స్కూటర్ 32 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ తో వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ ధర రూ.1.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి