Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ వార్నింగ్‌.. ఇలా చేయకపోతే రూ.10 లక్షల జరిమానా!

TRAI: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారతదేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ జనాభాలో ఇప్పటికీ సాంకేతికంగా పరిజ్ఞానం లేనివారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అవాంఛిత, స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసానికి..

TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ వార్నింగ్‌.. ఇలా చేయకపోతే రూ.10 లక్షల జరిమానా!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2025 | 7:25 AM

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కస్టమర్లను పదే పదే వేధించే అవాంఛిత లేదా స్పామ్ కాల్‌లను ఆపడానికి TRAI కొత్త నియమాలను జారీ చేసింది. ఇందులో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు చేసిన కొన్ని తప్పులకు గానూ రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాంటి స్పామ్, అవాంఛిత కాల్స్ ఆపడానికి టెలికాం కంపెనీలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని TRAI కొత్త నిబంధనలలో స్పష్టంగా పేర్కొంది.

స్పామ్ కాల్స్ సంఖ్యను చెప్పాల్సి ఉంటుంది:

కొత్త నిబంధనల ప్రకారం, ఏ నంబర్‌కు ఎన్ని స్పామ్ కాల్స్ వచ్చాయో ఖచ్చితంగా వెల్లడించాలని టెలికాం కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఇది మాత్రమే కాదు, కంపెనీలు ఇలా చేయకపోతే, వారు రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అసాధారణంగా అధిక సంఖ్యలో కాల్స్, తక్కువ వ్యవధిలో కాల్స్, ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ నిష్పత్తి వంటి పారామితుల ఆధారంగా కాల్, SMS నమూనాలను విశ్లేషించాలని TRAI అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని ఆధారంగా స్పామ్ కాల్స్ జాబితాను అందించమని వారిని ట్రాయ్‌ కోరింది.

‘టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కన్స్యూమర్ ప్రియారిటీ రూల్స్’ను సవరించడం ద్వారా, టెలికాం కంపెనీలపై జరిమానాలు విధించే నిబంధనలు రూపొందించారు. ఈ కొత్త నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేయలేకపోతే, అప్పుడు వారిపై ఈ జరిమానా విధించబడుతుంది. కొత్తగా నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం, తప్పుడు సమాచారం అందించినందుకు టెలికాం కంపెనీలకు మొదటి ఉల్లంఘనకు రూ. 2 లక్షలు, రెండవ ఉల్లంఘనకు రూ. 5 లక్షలు, తదుపరి ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది.

భారతదేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ జనాభాలో ఇప్పటికీ సాంకేతికంగా పరిజ్ఞానం లేనివారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అవాంఛిత, స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీని గురించి ఆందోళన చెందుతోంది. అలాగే ప్రజలను అవగాహన కల్పించడానికి నిరంతరం కృషి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ట్రాయ్ ఈ నిర్ణయం రాబోయే కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి