Gas Cylinder: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా.? టెన్షన్ పడకండి.! మీకో గుడ్ న్యూస్..
పెరుగుతూపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల బడ్జెట్‌కు గండి కొడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు..
పెరుగుతూపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల బడ్జెట్‌కు గండి కొడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఈ నెలలో కూడా గ్యాస్ కంపెనీలు.. సిలిండర్లపై మరో రూ. 50 పెంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ప్రజలు తమ అవసరాలన్నింటినీ తగ్గించినప్పటికీ.. భవిష్యత్తు కోసం మాత్రం సరిగ్గా పొదుపు చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయేది మీరు తెలుసుకుంటే.. ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. అదేంటో తెలుసుకుందామా..
‘సూర్య నూతన్’.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తయారు చేసిన రెండు బర్నర్ల సోలార్ స్టవ్. ఇటీవల జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేయడమే కాదు.. త్వరలోనే 30 మిలియన్ల హౌస్‌హోల్డ్స్‌కు ఈ స్టవ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. చమురు దిగుమతులను తగ్గించడానికి, దేశీయ ఉత్పత్తిని పెంచడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో సోలార్ స్టవ్ ఒకటి. మీరు ఈ సోలార్ స్టవ్‌ని మీ వంటగదిలో సులభంగా ఉపయోగించవచ్చు. ఈ స్టవ్ రెండు యూనిట్స్ అమర్చబడి ఉంటాయి. ఒకదానిని మీరు కిచెన్‌లో ఫిట్ చేస్తే.. మరొక యూనిట్‌ని వంటగదిలో అమర్చాలి. ఇది సౌరశక్తితో ఛార్జ్ చేయబడుతుంది.
ఈ సోలార్ స్టవ్ ఇన్సులేషన్ డిజైన్ సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌ను తగ్గిస్తుంది. మన అవసరాలకు తగ్గట్టుగా దీన్ని వివిధ పరిమాణాలలో రూపొందిస్తారు. ఈ స్టవ్‌ను మీ ఇంటికి తెచ్చుకోవడం ద్వారా.. గ్యాస్ సిలిండర్ బాధలకు చెక్ పెట్టొచ్చు. దీంతో మీకు వన్ టైమ్ ఖర్చు.. దీర్ఘకాలంలో పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. మరోవైపు ‘సూర్య నూతన్’ సోలార్ స్టవ్ హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తుంది. అంటే సౌరశక్తితో పాటు ఇతర విద్యుత్ వనరులను కూడా ఈ స్టవ్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ సోలార్ స్టవ్ మూడు విభిన్న మోడళ్లలో అందుబాటులో ఉంది.
కాగా, ఈ సోలార్ స్టవ్ ప్రాధమిక బేసిక్ మోడల్ రూ.12 వేలకు, టాప్ మోడల్ రూ. 23 వేలుగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఈ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది. అలాగే ఇది రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లను రిప్లేస్ చేసే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.(Source)