AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: మీ ముద్దుల కూతురు చేతికి రూ.72 లక్షలు.. పోస్టాఫీస్‌లో ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన మీ కూతురు భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం 8.2శాతం అధిక వడ్డీని అందిస్తుంది. క్రమబద్ధమైన పెట్టుబడితో రూ.72 లక్షల నిధిని పొందవచ్చు. పన్ను మినహాయింపులు, ప్రభుత్వ హామీతో ఇది అత్యంత నమ్మదగిన పొదుపు. కూతురు ఉన్నత విద్య, వివాహ ఖర్చులకు ఇది బలమైన పునాది.

Post Office: మీ ముద్దుల కూతురు చేతికి రూ.72 లక్షలు.. పోస్టాఫీస్‌లో ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?..
Sukanya Samriddhi Yojana
Krishna S
|

Updated on: Nov 21, 2025 | 3:59 PM

Share

తల్లిదండ్రులు తమ కూతురు భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని, ఆమె చదువు లేదా వివాహం కోసం ఎవరిపైనా ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని కలలు కంటారు. మన దేశంలో కూతురు భవిష్యత్తు కోసం ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ సుకన్య సమృద్ధి యోజన అత్యంత నమ్మదగిన, ఆకర్షణీయమైన పథకంగా మిగిలిపోయింది. పోస్టాఫీసు యొక్క ఈ చిన్న పొదుపు పథకం, ఇతర పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. ఈ 2025 త్రైమాసికానికి ఈ పథకం 8.2శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

రూ.72 లక్షల నిధిని తయారు చేసే లెక్క

మీరు మీ కూతురు కోసం భారీ నిధిని నిర్మించాలని చూస్తున్నట్లయితే.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా ఈ పథకం మీకు బెస్ట్ ఆప్షన్. మీరు గరిష్టంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 1.50 లక్షలు చొప్పున (అంటే రోజుకు రూ.411) 15 ఏళ్లు నిరంతరం డిపాజిట్ చేస్తే.. మీ మొత్తం మూలధనం రూ. 22,50,000 అవుతుంది. ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటుతో లెక్కించినప్పుడు.. 21 ఏళ్ల తర్వాత ప మీకు దాదాపు రూ.49,32,119 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మీ మొత్తం మెచ్యూరిటీ సుమారు రూ.71,82,119 అవుతుంది.

కాంపౌండింగ్ మాయాజాలం

సుకన్య సమృద్ధి యోజన యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని మెచ్యూరిటీ విధానం. మీరు 15 సంవత్సరాలు మాత్రమే డిపాజిట్ చేయాలి.. అయితే ఈ మీ చేతికి మాత్రం 21ఏళ్ల తర్వాత డబ్బు అందుతుంది. అంటే మీరు చివరి ఆరు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయనప్పటికీ, మీ డిపాజిట్లపై వడ్డీ లభిస్తూనే ఉంటుంది. ఈ చక్రవడ్డీ మాయాజాలం ద్వారా మీ కూతురు ఉన్నత విద్య లేదా వివాహ ఖర్చులను తీర్చడానికి బలమైన పునాది ఏర్పడుతుంది.

ప్రభుత్వ హామీ – పన్ను మినహాయింపు

బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారం కింద ప్రారంభించిన ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలో సుకన్య సమృద్ధి ఖాతాల సంఖ్య 40 మిలియన్లు దాటింది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి ఇది మార్కెట్ రిస్క్‌కు గురికాదు. ప్రభుత్వం వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తుంది. పన్ను ప్రయోజనం విషయానికి వస్తే ఈ పథకానికి EEE మోడల్ వర్తిస్తుంది. దీని అర్థం డిపాజిట్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది. సంపాదించే వడ్డీ మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం.

ఖాతా తెరవడానికి నియమాలు

ఈ పథకాన్ని 10ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఆమె తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు తెరవవచ్చు. మీరు కేవలం రూ.250తో ఖాతాను తెరిచి, మీ సౌలభ్యం మేరకు మొత్తాన్ని పెంచుకోవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.250 డిపాజిట్ తప్పనిసరి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us