Life certificate: లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం చాలా సులభం.. పెన్షనర్లు ఈ పద్దతులు పాటిస్తే చాలంతే

ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ పొందుతారు. వారి జీతం ఆధారంగా ప్రతినెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతాలో జమఅవుతుంది. ఒక వేళ ఉద్యోగి మరణిస్తే భార్యకు ఈ పెన్షన్ అందిస్తారు. అయితే పెన్షన్ పొందుతున్న వారందరూ ఏటా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అప్పుడే వారికి పెన్షన్ రావడం కొనసాగుతుంది. ఈ మేరకు ఏటా నవంబర్ లో విండో తెరుస్తారు.

Life certificate: లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం చాలా సులభం.. పెన్షనర్లు ఈ పద్దతులు పాటిస్తే చాలంతే
Ap Pensioners
Follow us

|

Updated on: Nov 05, 2024 | 3:00 PM

80 ఏళ్ల లోపు వారందరూ ఆ సమయంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి. బ్యాంకులు, పోస్టాఫీసులు, మరికొన్ని చోట్ల వీటిని అందిాంచాలి. నవంబర్ లో అందజేయకపోతే డిసెంబర్ నుంచి పెన్షన్ రావడం ఆగిపోతుంది. ఈ క్రింద తెలిపిన పద్ధతులు పాటిస్తే చాలా సులువుగా పని జరుగుతుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి నాలుగు రకాల పద్దతులను అనుసరించవచ్చు. జీవన్ ప్రమాణ్ పోర్టల్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్ బీ) ఏజెంట్, పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలు, బ్యాంకులలో అందజేసే అవకాశం ఉంది. వీటిలో తమకు వీలైన విధానంలో పెన్షనర్లు సర్టిఫికెట్లను అందజేయవచ్చు.

ఆన్ లైన్ లో సమర్పించే విధానం

  • జీవన్ ప్రమాణ్, ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ ద్వారా ముఖం, వేలిముద్ర, ఐరిష్ గుర్తింపుతో సహా బయోమెట్రిక్ సాంకేతికతతో పెన్షనర్లు తమ గుర్తింపును సమర్పించవచ్చు.
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధాఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • పెన్షనర్ గురించి దానిలో అడిగిన సమాచారం పూర్తి చేయాలి.
  • ఫోటో తీసిన తర్వాత, సమాచారాన్ని సబ్మిట్ చేయాలి, మీ ఫోన్ నంబర్ కు జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేయడానికి లింక్ తో ఎస్ఎంఎస్ వస్తుంది.

ఆఫ్ లైన్ విధానంలో..

ఆఫ్ లైన్ విధానంలో అందజేయాలనుకునే వారు నేరుగా పోస్టాఫీసులు, బ్యాంకులు, ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. అక్కడ ఉన్న సిబ్బందికి తమ వివరాలు అందజేయాలి.

చివరి తేదీ

పెన్షన్ దారులలో 80 ఏళ్ల లోపు వారందరూ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడానికి నవంబర్ 30వ తేదీ వరకూ గడువు ఉంది. అంతకంటే ఎక్కువ వయసున్న వారు అక్టోబర్ 1 నుంచే అందజేసే అవకాశం ఉంది. వారికి కూడా నవంబర్ 30వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అంటే 80 ఏళ్లు దాటిన వారికి రెండు నెలలు, ఆలోపు వారికి ఒక నెల గడువు ఉంటుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం కల్పించింది. కాాగా. గడువు లోపు సర్టిఫికెట్ అందజేయకపోతే డిసెంబర్ నుంచి పింఛన్ ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే