Best 125cc bike: ఈ 125 సీసీ బైక్‌లు రెండూ తోపులే.. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలివే..!

ద్విచక్ర వాహనాల మార్కెట్ నిత్యం అనేక కొత్త బైక్ లతో సందడిగా మారుతోంది. స్లైల్, లుక్, ఫీచర్లలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. వాటిలో ఏ బండిని ఎంచుకోవాలో కస్టమర్ కు పెద్ద ఫజిల్ గా మారింది. కాబట్టి ఏ బైక్ ను కొనుగోలు చేయాలో ముందే నిర్ణయించుకుని షోరూమ్ కు వెళ్లాలి.

Best 125cc bike: ఈ 125 సీసీ బైక్‌లు రెండూ తోపులే.. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలివే..!
Hero Xtreme, Pulsar 125
Follow us
Srinu

|

Updated on: Nov 05, 2024 | 2:45 PM

ప్రస్తుతం 125 సీసీ ఇంజిన్ వాహనాలపై యువత ఆసక్తి చూపుతున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ 125, హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ మోటారు సైకిళ్లు ముందు వరుసలో ఉన్నాయి. అమ్మకాలలో ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ధర, ప్రత్యేకతలు, తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంజిన్, మైలేజ్

  • బజాజ్ పల్సర్ ఎన్ 125 బైక్ లో 124.88 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 11.83 హెచ్ పీ, 11 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. ఈ ఇంజిన్ కు ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. లీటర్ కు దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
  • హీరో ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ బైక్ లోని 124.7 సీసీ ఇంజిన్ నుంచి 11.4 హెచ్ పీ, 10.5 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. ఐదు స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంది. సుమారు 66 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

సస్పెన్షన్, బ్రేకులు

  • బజాజ్ పల్సర్ ఎన్ 125 బైక్ వెనుక మోనోషాక్ సెటప్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు ఏర్పాటు చేశారు. ముందు చక్రానికి 240 ఎంఎం డిస్క్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఉంది. దీనిలో ఏబీఎస్ సిస్టమ్ లేదు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది.
  • హీరో ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ వెనుక వైపు హైడ్రాలిక్ షాక్, ముందు వైపు సంప్రదాయ ఫోర్కులు ఉన్నాయి. ముందు 276 ఎంఎం డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకులు ఏర్పాటు చేశారు. దీనిలోని టాప్ వేరియంట్ లో సింగిల్ చానల్ ఏబీఎస్ ఉంది.

ఇంధన ట్యాంకు సామర్థ్యం

  • పల్సర్ బైక్ ఇంధన ట్యాంకు సామర్థ్యం 9.5 లీటర్లు. అలాగే సీటు ఎత్తు 795 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 198 ఎంఎం. దీనిలోని డిస్క్ బ్రేక్ వేరియంట్ బరువు 127.5 కిలోలు ఉంటుంది.
  • హీరో ఎక్స్ ట్రీమ్ విషయానికి వస్తే ఇంధన ట్యాంకు సామర్థ్యం 10 లీటర్లు, సీటు ఎత్తు 794 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం.

ఫీచర్లు

  • పల్సర్ ఎన్ 125లో ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే మోనోక్రోమ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. దీని ద్వారా కాల్స్ ను అంగీకరించడం, తిరస్కరించడం చేయవచ్చు. మిస్ట్ కాల్స్, మెసేజ్ లను ఎప్పటికప్పుడు చూడవచ్చు.
  • ఎక్స్ ట్రీమ్ లోని డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కి మద్దతు ఇవ్వదు. దీనిలోనూ ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.

ధర

  • పల్సర్ బైక్ రూ.94,707 నుంచి రూ.98,707 (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ అందిస్తున్నారు.
  • ఎక్స్ ట్రీమ్ ధర రూ.95 వేలు (ఎక్స్ షోరూమ్) కాగా, దీనిలోని టాప్ వేరియంట్ రూ.99,500 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. దీనిపై ఐదేళ్లు లేదా 70 వేల కిలోమీటర్ల వరకూ వారంటీ అందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి