Tata Nexon: సూపర్ లుక్‌లో టాటా నెక్సాన్ కార్లు..సన్ రూఫ్ అప్‌డేట్ తీసుకువచ్చిన కంపెనీ

టాటా కంపెనీ విడుదల చేసే కార్లకు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. నాణ్యత, పనితీరు, టెక్నాలజీ విషయంలో ఈ కార్లు ఎప్పుడు ముందంజలో ఉంటాయి. సరికొత్త ఫీచర్లతో, లేటెస్ట్ లుక్ తో ఎప్పటికప్పుడు వినియోగదారుల ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో ముందడుగు వేసింది. టాటా నెక్సా స్ ఎస్ యూవీలోని ఫియల్ లెస్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ మోడళ్లకు పరోరమిక్ సన్ రూఫ్ ను పరిచయం చేసింది.

Tata Nexon: సూపర్ లుక్‌లో టాటా నెక్సాన్ కార్లు..సన్ రూఫ్ అప్‌డేట్ తీసుకువచ్చిన కంపెనీ
Tata Nexon Sunroof
Follow us
Srinu

|

Updated on: Nov 05, 2024 | 2:30 PM

టాటా కార్లలో నెక్సాస్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు నెక్సాస్ ఎస్ యూవీని టాటా నవీకరించింది. ఫియర్ లెస్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ మోడళ్లకు సన్ రూఫ్ ను ఏర్పాటు చేసింది. ఐసీఎన్ జీ వెర్షన్ కు ఇప్పడు క్రియేటవ్ ప్లస్ పీఎస్ ట్రిమ్ లో ఈ ఫీచర్ ను అందిస్తుంది. ఈ అప్ డేట్ వేరియంట్ ధర రూ.12.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా మోటార్స్ తన నెక్సాన్ కారును ఆధునీకరించింది. పెట్రోలు, డీజిల్ పవర్ ట్రెయిన్ లలో పనోరమిక్ సన్ రూఫ్ తో కొత్త టాప్ స్పెక్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సింగిల్ పాన్ సన్ రూఫ్ ను పొందటానికి ఫియర్ లెస్ ట్రిమ్ ను కూడా అప్ డేట్ చేసింది. అలాగే ఐసీఎన్ జీ ఇంధన వెర్షన్ మిడ్ స్పెక్ క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో ఐచ్చిక సన్ రూఫ్ అందుబాటులో ఉంది. సన్ రూఫ్ ఉన్న కార్ల విక్రయాలు మన దేశంలో జోరందుకున్నాయి. అనేక కుటుంబాలు ఇలాంటి వాహనాలనే ఇష్టపడుతున్నాయి. దీంతో టాటా మోటార్స్ సన్ రూఫ్ తో కూడిన అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఇలాంటి ఆధునిక ఫీచర్ ఉన్న కార్ల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్లు

నిర్బయ ప్లస్ పీఎస్ (పెట్రోలు)

కొత్త ఫియర్ లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో మాన్యువల్ ట్యాన్స్ మిషన్ ఏర్పాటు చేశారు. దీని పెట్రోలు వెర్షన్ రూ.13.59 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే డ్యూయల్ క్లబ్ ట్రాన్స్ మిషన్ తో కూడిన వేరియంట్ రూ.14.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.

నిర్బయ ప్లస్ పీఎస్ (డీజిల్)

ఫియర్ లెస్ ప్లస్ పీఎస్ డీజిల్ వేరియంట్ లోనూ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.14.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో ఏఎంటీ తో వేరియంట్ కు రూ.15.59 లక్షల వరకూ వెచ్చించాలి.

ఇవి కూడా చదవండి

క్రియేటివ్ ప్లస్ పీఎస్ (ఐసీఎన్ జీ)

పనోరమిక్ సన్ రూఫ్ కలిపిన క్రియేటివ్ ప్లస్ పీఎస్ లోని ఐసీఎన్ జీ వేరియంట్ రూ.12.79 లక్షలకు అందుబాటులో ఉంది. దీనిలోనే డ్యూయల్ టోన్ వేరియంట్ కోసం రూ.12.99 లక్షల నుంచి మొదలవుతోంది.

ఇంజిన్ ఎంపికలు

టాటా నెక్సాన్ ఎస్ యూవీ పెట్రోలు, డీజిల్, ఐసీఎన్ జీ తదితర మూడు రకాల ఇంధన ఎంపికలతో అందుబాటులోకి ఉంది. పెట్రోలు, ఐసీఎన్ జీ వెర్షన్లకు 1.2 లీటర్ల టర్బో చార్జ్ రివోర్ట్రన్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. డీజిల్ వెర్షన్ మాత్రం 1.5 లీటర్ల టర్బో చార్జ్ రివోటార్క్ ఇంజిన్ అమర్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!