Car Maintenance: మన అజాగ్రత్తే కొంప ముంచుతుందని తెలుసా? ఆ ఒక్క పనితో ప్రమాదాలకు చెక్

కారు అనేది నేడు అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది. మధ్యతరగతి ప్రజలు సైతం తమ అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగిస్తున్నారు. ప్రజల ఆదాయంపెరగడం, కార్ల ధరలు అందుబాటులోకి రావడం దీనికి ప్రధాన కారణం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి కారు చాలా ఉపయోగంగా ఉంటుంది. గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవడంతో పాటు ఖర్చులు కూడా కలిసివస్తాయి.

Car Maintenance: మన అజాగ్రత్తే కొంప ముంచుతుందని తెలుసా? ఆ ఒక్క పనితో ప్రమాదాలకు చెక్
Car Maintenance
Follow us

|

Updated on: Nov 05, 2024 | 2:12 PM

కారును కొనుగోలు చేయడం, వినియోగించడంతో పాటు దాని నిర్వహణ కూడా చాలా అవసరం. అప్పుడే ఎక్కువ కాలం సేవలు అందిస్తుంది. ముఖ్యంగా బ్రేకుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దీని వల్ల కారు పనితీరు మెరుగ్గా ఉండడంతో పాటు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. ఈ కింది తెలిపిన జాగ్రత్తలు పాటించడం వల్ల బ్రేక్ వైఫల్యాల నుంచి రక్షణ పొందవచ్చు.

శబ్దాలు

కారు బ్రేక్ లను నొక్కినప్పుడు ఏవైనా శబ్దాలు వస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. వాటి ధ్వని ఎక్కువగా ఉంటే బ్రేక్ ప్యాడ్ లు అరిగిపోయినట్టు గమనించాలి. వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలి. ముందుగానే స్పందించడం వల్ల తీవ్రమైన నష్టం నుంచి, ఖరీదైన మరమ్మతుల నుంచి దూరంగా ఉండవచ్చు. కాబట్టి కారు నడిపేటప్పుడు వచ్చే శబ్దాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తే ముఖ్యం

బ్రేక్ పెడల్ ను నొక్కినప్పుడు చాలా స్మూత్ గా, స్పాంజిలా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. బ్రేక్ ద్రవం వల్ల, గాలి, తేమ వల్ల ఆ సమస్య ఏర్పడవచ్చు. సాధారణ బ్రేక్ ఫ్లూయిడ్ ఫ్లష్ తో దీన్ని పరిష్కరించవచ్చు. ఈ సమస్యను గుర్తిస్తే వెంటనే మెకానిక్ ను సంప్రదించాలి. అలాగే బ్రేక్ నొక్కిన తర్వాత ఆగటానికి సాధారణ సమయంలో కంటే ఎక్కువ పడుతుంటే బ్రేక్ ప్యాడ్లు లేదా రోటర్లను మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

తనిఖీలు

కారు నిర్వహణ, దానిలో భాగాలను మార్చుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. సాధారణంగా బ్రేక్ ప్యాడ్ లను 50 వేల నుంచి లక్ష కిలోమీటర్లకు మార్చాలి. అయితే మీ డ్రైవింగ్ తీరు, మీరు వెళ్లే వేగం తదితర పరిస్థితులపై కూడా అవి ఆధారపడి ఉంటాయి. దాని కోసం తరచూ తనిఖీ చేయాలి. బ్రేక్ ప్యాడ్ మందం పావు వంతుకు అరిగిపోతే వెంటనే మార్చుకోవాలి. అలాగే బ్రేక్ వేసినప్పుడు పల్పింగ్ సెన్సేషన్ అనిపిస్తే రోటర్లను మార్చుకోవాలి. సాధారణంగా వీటిని లక్ష నుంచి లక్షన్నర కిలోమీటర్లకు మార్చడం అవసరం.

బ్రేక్ ఆయిల్

నెలకు ఒక్కసారైనా బ్రేక్ ఆయిల్ ను తనిఖీ చేయాలి. ఆయిల్ తక్కువగా ఉంటే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. పెడల్ నొక్కగానే స్పాంజిని తొక్కినట్టు అనిపిస్తుంది. అలా అనిపిస్తే వెంటనే మార్చాలి. బ్రేక్ ఆయిల్ చిక్కగా మారిపోయినా, మురికిగా మారినా వెంటనే ఆయిల్ మార్చుకోవడానికి సంకేతంగా భావించాలి. కారు మ్యాన్యువల్ ప్రకారం ప్రతి 2, 3 సంవత్సరాలకు బ్రేక్ ఆయిల్ మార్చాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే