Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

Gold Price Today: ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా..

Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2024 | 3:48 PM

దేశంలో బంగారం ధరలకు బ్రేకులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. తాజాగా నవంబర్‌ 5వ తేదీన దేశంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 150 రూపాయల వరకు తగ్గి రూ.73,550 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములపై 160 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.80,240 వద్ద ఉంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు తగ్గినా, పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే తుంటాయి. బంగారం దిగుమతిలో కూడా భారత్‌ ముందంజలో ఉంది. మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇది కూడా చదవండి: BSNL: 397తో 150 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌!

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,390 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,240 ఉంది.
  3. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,240 ఉంది.
  4. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,240 ఉంది.
  5. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,240 ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,240 ఉంది.
  7. దీపావళి పండుగ ముగిసిన తర్వాత బంగారం ధర నిరంతరం తగ్గుతూనే ఉంది. కాగా, వెండిపై వెయ్యి రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం రూ.96,600గా ఉంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి.

ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 2,752.80 డాలర్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. 2025 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు $3,000 చేరుకోవచ్చని అంచనా.

ఇది కూడా చదవండి: Bank Locker Rules: మారిన బ్యాంకు లాకర్‌ నిబంధనలు.. కొత్త ఛార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి