AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar EV Car: అదరగొడుతున్న సోలార్ ఈవీ కారు.. మతిపోగొడుతున్న లుక్స్..!

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీలను ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ చార్జింగ్ భయాలతో కొంత మంది ఈవీలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం సోలార్ ద్వారా శక్తిని పొందే ఈవీ కారు వావే ఇవా రిలీజ్ చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Solar EV Car: అదరగొడుతున్న సోలార్ ఈవీ కారు.. మతిపోగొడుతున్న లుక్స్..!
Vayve Eva
Nikhil
|

Updated on: Jan 24, 2025 | 3:41 PM

Share

ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2025లో ఇవా పేరుతో సోలార్ ఈవీ కారును రిలీజ్ చేశారు. పూణే ఆధారిత వావే మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇవాను మూడు వేరియంట్‌లలో విడుదల చేసింది. నోవా, స్టెల్లా, వేగా వేరయంట్స్‌తో సోలార్ ఈవీను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 3.25 లక్షలు, రూ. 3.99 లక్షలు, రూ. 4.49 లక్షలుగా ఉన్నాయి. అయితే బ్యాటరీ అద్దె ప్లాన్ లేకుండా అయితే రూ. 3.99 లక్షలు, రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షల ధరలతో ఈ కార్లను లాంచ్ చేశారు. ఆటో ఎక్స్‌పోలో ఈ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వావే ఇవా నోవా, స్టెల్లా, వేగాకు సంబంధించిన మూడు వేరియంట్లు వరుసగా 9 కేడబ్ల్యూహెచ్, 12 కేడబ్ల్యూహెచ్, 18 కేడబ్ల్యూహెచ్‌కు సంబంధించి విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తాయి. 

నోవా, స్టెల్లా 16 పీఎస్ పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుండగా, వేగా 20 పీఎస్ శక్తిని అందిస్తుంది. ఆర్‌డబ్ల్యూడీ సెటప్‌తో ఇవా 250 కిమీ వరకు మైలేజ్‌ను ఇస్తుంది. వావే కంపెనీ ప్రతినిధులు తెలిపిన ప్రకారం నోవాకు కనీసం 600 కి.మీ, స్టెల్లాకు 800 కి.మీ, వేగాకి 1200 కి.మీల కనీస క్యాప్‌తో నడిచే బ్యాటరీ ప్యాక్‌ను అందించామని పేర్కొన్నారు. అంటే కిలోమీటరుకు కేవలం రూ. 2తో ప్రయాణించవచ్చు. కారును నడపకపోయినా కారు పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్ సౌర శక్తి ద్వారా ఛార్జ్ చేసే వీలు ఉంటుందని, అలాగే ప్రతిరోజూ 10 కిమీ పరిధిని జోడిస్తుందని వావే పేర్కొంది. ఈ కారు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే 5 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

ఇక వావే ఇవా ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారు ట్విన్-స్క్రీన్ సెటప్ (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, మాన్యువల్ ఏసీ, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 6-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసే డ్రైవర్ సీటుతో వస్తుంది. ప్రస్తుతం ఈ కారును కేవలం రూ. 5,000 టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు చేసుకోవచ్చు. అయితే ఈ కారు  డెలివరీల కోసం కస్టమర్‌లు చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇంచుమించు 2026వ సంవత్సరం చివర్లో ఈ కారు డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి