Allu Arjun: అల్లు సినిమాస్.. భాగ్యనగరంలో ఐకానిక్ ల్యాండ్ మార్క్
హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమాగా అల్లు సినిమాస్ ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. వరల్డ్ సెకండ్ బెస్ట్ డాల్బీ అనుభవంతో, 75 అడుగుల స్క్రీన్, డాల్బీ విజన్, అట్మాస్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో అసాధారణ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
హైదరాబాద్‌లో ఐకానిక్ ల్యాండ్ మార్క్… అల్లు సినిమాస్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఆసియాలో అతి పెద్ద డాల్బీ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది అల్లు సినిమాస్. అతి త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. అల్లు సినిమాస్ నిర్మాణ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి. టెక్ చెక్ కూడా నిర్విఘ్నంగా జరిగింది. ఐకానిక్ ఎక్స్ పీరియన్స్ కోసం సగటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ సెకండ్ బెస్ట్ డాల్బీ సినిమాని ఎక్స్ పీరియన్స్ ఎలా ఉండబోతోందో.. మనమూ ఓ సారి మాట్లాడుకుందాం వచ్చేయండి… సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని సరికొత్త తీసుకెళ్లే ఐకానిక్ సందర్భం… అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అల్లు స్టూడియోస్‌లో ఏర్పాటైన అల్లు సినిమాస్… డాల్బీ టెక్ చెక్‌లో పాల్గొన్నవారందరి నోటా ఇప్పుడు ఇదే మాట. అతి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది అల్లు సినిమాస్. ఎక్స్ ట్రార్డినరీ అనేది చాలా చిన్న పదం. ఎవరైనా సరే, నెక్స్ట్ లెవల్ అనాల్సిందే.. టాప్ నాచ్ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ.. అంటూ అల్లు సినిమాస్ గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏషియాస్ బిగ్గెస్ట్ డాల్బీ ఇన్, వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ డాల్బీ సినిమా ని ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఎవరైనా సరే అల్లు సినిమాస్ వైపు అడుగులు వేసి తీరాల్సిందే. టెక్ చెక్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నది పలువురు సినీ ప్రముఖుల మాట. హైదరాబాద్‌లో నెక్స్ట్ ఐకానిక్ స్పాట్ ఇదేనన్నది ముక్తకంఠంగా వినిపిస్తోంది. పిక్చర్ క్వాలిటీ అదిరిపోయింది. సౌండ్‌కి తిరుగులేదనే ప్రశంసలు అందుతున్నాయి. ఆల్రెడీ ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్, ప్రొజెక్షన్ సెట్టింగ్స్ టెస్టులు కంప్లీట్ అయ్యాయి. వారణాసి, రామాయణ టీజర్ క్లిప్స్ టెక్ చెక్‌లో భాగంగా ప్రదర్శించామే తప్ప, కమర్షియల్ స్క్రీనింగ్ కాదన్నది నిర్వాహకులు చెబుతున్న మాట. టెక్ చెక్‌లో భాగంగా వీక్షకులు ది రాజా సాబ్, పుష్ప2 ట్రైలర్లను చూసి ఆనందించారు. అల్లు స్టూడియోస్‌లో ఉన్న అల్లు సినిమాస్‌లో అడుగడుగునా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ. ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. 75 అడుగుల వెడల్పాటి స్క్రీన్, సెవన్టీ ఫైవ్ ఫీట్ వైడ్ dci ఫ్లాట్ 1.85: 1 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, 4కే డ్యూయల్ ఆర్జీబీ లేసర్, డాల్బీ విజన్, డాల్బీ త్రీడీ ప్రొజెక్షన్.. ఇలా చెప్పుకుంటూ పోతే స్పెషాలిటీస్ చాలానే. వీటికి తోడు డాల్బీ అట్మాస్ సౌండ్, పిచ్ బ్యాక్ స్టేడియమ్ సీటింగ్.. అన్నీ కలగలిపి కలిగించే ఎక్స్ పీరియన్స్ మరో రేంజ్. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలతో పాటు ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుల ఫొటోలు అల్లు సినిమాస్ ఆవరణలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నాయి. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆహ్లాదకరంగా అల్లు సినిమాస్ ఎక్స్ పీరియన్స్ పంచుకుంది అల్లు ఫ్యామిలీ. ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ క్లాస్.. ఫైవ్ స్టార్ ఎక్స్ పీరియన్స్ అంటున్నారు విట్నెస్ చేసినవారు. డాల్బీ సినిమా ఎక్స్ పీరియన్స్ చూశాక, మిగిలిన థియేటర్ల వైపు వెళ్లడానికి సిసలైన సినీ ప్రేక్షకులకు మనసొప్పదన్నది అనుభవజ్ఞుల మాట. కలర్ అక్యూరసీ, సౌండ్, పిక్చర్ క్వాలిటీ, కాంట్రాస్ట్.. ఇలా ప్రతి విషయంలోనూ టాప్ నాచ్ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ అనే మాట పదే పదే వినిపిస్తోంది. థియేటర్లలోనే సినిమా చూడాలనే భావనను ప్రేక్షకుల్లో మళ్లీ కలిగించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు అల్లు సినిమాస్‌లో ఉన్నాయన్నది టెక్ చెక్కి అటెండ్ అయిన వాళ్ల డిక్లరేషన్! అన్నట్టు… అల్లు సినిమాస్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. మొదటి స్క్రీన్‌లో డాల్బీ సినిమా ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ స్క్రీన్స్ లో 4కే డాల్బీ అట్మాస్ ని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Sethupathi: 2026లో మక్కళ్ సెల్వన్ ప్లానింగ్ అదిరిందిగా
చిరు విత్ వెంకీ.. పండక్కి డబుల్ స్వాగ్ షురూ
The Raja Saab: పుష్ప2 Vs ధురంధర్.. మరి ది రాజాసాబ్ టార్గెట్ ఎవరు ??
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

