స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 129 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 39,816 వద్ద, 44 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,910 వద్ద ముగిశాయి. ఉదయం నుంచి ట్రేడింగ్ మొత్తం ఊగిసలాట మధ్యే జరిగింది. వాణిజ్య ఘర్షణలు పెరగడం, ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తుందనే వార్తల మధ్యలో షేర్ హోల్డర్స్ ఆచితూచీ వ్యవహరించారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు చివరి గంటలో మార్కెట్‌ను లాభాల్లోకి మళ్లించాయి. నిఫ్టీ ఐటీ […]
స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 129 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 39,816 వద్ద, 44 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,910 వద్ద ముగిశాయి. ఉదయం నుంచి ట్రేడింగ్ మొత్తం ఊగిసలాట మధ్యే జరిగింది. వాణిజ్య ఘర్షణలు పెరగడం, ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తుందనే వార్తల మధ్యలో షేర్ హోల్డర్స్ ఆచితూచీ వ్యవహరించారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు చివరి గంటలో మార్కెట్‌ను లాభాల్లోకి మళ్లించాయి. నిఫ్టీ ఐటీ సూచీ లాభపడగా.. రియాల్టీ సూచీ నష్టాల్లో ముగిసింది.