స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు.. శుక్రవారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రారంభంలో 200 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్ కొద్ది క్షణాలకే ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా ఇవాళ ఫ్లాట్‌గా మొదలైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 23 పాయింట్లు లాభపడి 39,839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,917 వద్ద స్థిరపడ్డాయి.