భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 395 పాయింట్ల మేర నష్టంతో 39,513 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 11,811 మార్కు వద్ద‌ ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ… లోక్‌సభలో ఆర్ధిక మంత్రి 2019 ప్రసంగం తర్వాత ఇక పైకి వెళ్లలేదు. మూలధన మార్కెట్ విధానాలకు సంబంధించి […]

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 4:00 PM

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 395 పాయింట్ల మేర నష్టంతో 39,513 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 11,811 మార్కు వద్ద‌ ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ… లోక్‌సభలో ఆర్ధిక మంత్రి 2019 ప్రసంగం తర్వాత ఇక పైకి వెళ్లలేదు. మూలధన మార్కెట్ విధానాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రధానంగా ఎన్ఆర్ఐ పోర్టిఫోలియో పెట్టుబడులను విదేశీ పెట్టుబడులతో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. డాలరుతో రూపాయి మారకం 68.54 వద్ద ట్రేడవుతోంది.