Telugu News Business Stock Market: Rs 100 to 18 Lakhs! Discover Multi Bagger Returns
వారెవ్వా.. పదేళ్ల క్రితం రూ.100తో షేర్ కొంటే.. ఇప్పుడు రూ.18 లక్షలు వచ్చాయి! కళ్లు చెదిరే రిటర్న్ ఇచ్చిన షేర్లు ఇవే
డబ్బు సంపాదించాలనే కల సాకారం కావాలంటే స్టాక్ మార్కెట్లో సరైన పెట్టుబడి అవసరం. సరైన సమయంలో, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే అనూహ్య రాబడి సాధ్యం. పదేళ్ల క్రితం రూ.100 పెట్టిన వారికి నేడు రూ.18 లక్షలు వచ్చాయి. ఇలాంటి మల్టీబ్యాగర్ షేర్లు మీ డబ్బును భారీగా పెంచుతాయి, సంపద సృష్టించే మార్గాన్ని చూపుతాయి.
చాలా మందికి డబ్బు సంపాదించాలనే కల ఉంటుంది. కానీ, అందుకోసం ముందు ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా సరైన టైమ్‌లో, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో తెలివిగా పెట్టుబడి పెడితే మంచి రిట్నర్స్ పొందవచ్చు. అలా పదేళ్ల క్రితం కొన్ని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది.
పది రెట్లు, వంద రెట్లు కాదు.. ఏకంగా 18 వేల రెట్లు రిటర్న్ ఇచ్చాయి ఆ షేర్లు. అంటే పదేళ్ల క్రితం రూ.100 పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజు వారి స్టాక్ విలువ రూ.18 లక్షలుగా ఉండేది. స్టాక్ మార్కెట్లో సరైన షేర్‌పై, ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం వల్ల అంచనాలకు మించి రాబడి లభిస్తుంది. మీరు మల్టీబ్యాగర్ రాబడి గురించి విని ఉండవచ్చు, అంటే ఒక స్టాక్ కొన్ని సంవత్సరాలలో మీ డబ్బును భారీగా పెంచుతుంది. అలాంటి కొన్ని షేర్ల గురించి ఇప్పుడు చూద్దాం..