Stock Market: వెంటాడుతున్న భయాలు.. వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రధానంగా గ్లోబల్ మార్కెట్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(FII), ఒమిక్రాన్ కేసులు ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రధానంగా గ్లోబల్ మార్కెట్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(FII), ఒమిక్రాన్ కేసులు ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. గత వారం మార్కెట్ ఒత్తిడిలో ఉంది. పెట్టుబడిదారుల సెంటిమెంట్ వారమంతా బలహీనంగా కొనసాగింది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2170.07 పాయింట్లు లేదా 3.67 శాతం నష్టపోయింది.
ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, ఒమిక్రాన్, డాలర్ ఇండెక్స్, ఎఫ్‌ఐఐలు ఈ వారం మార్కెట్ కదలికను నిర్ణయిస్తాయని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గత వారం, US ఫెడరల్ రిజర్వ్ మార్చి నుంచి బాండ్ కొనుగోలును ముగించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రుణ రేటు పెంపు ప్రారంభానికి సంకేతాలు ఇచ్చింది. రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (పరిశోధన) అజిత్ మిశ్రా మాట్లాడుతూ “ఇతర పెద్ద ఈవెంట్‌లు లేనప్పుడు, గ్లోబల్ క్యూస్ మా మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని అన్నారు
ప్రతికూల గ్లోబల్ సూచనలు, కొనసాగుతున్న ఎఫ్‌ఐఐ అమ్మకాలు, సానుకూల సూచనలు లేకపోవడం. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు మార్కెట్‌పై ఒత్తిడిని కొనసాగించవచ్చని భావిస్తున్నామని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్, బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐల) డిసెంబరులో భారతీయ మార్కెట్ల నుంచి ఇప్పటివరకు రూ.17,696 కోట్లను ఉపసంహరించుకున్నారు. కొత్త కరోనా వైరస్ Omicron ఒత్తిడి, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఉపసంహరణకు దారితీశాయి.
Read Also.. SBI 3-in-1 Account: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఒకే ఖాతాతో మూడు ప్రయోజనాలు..