AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్‌ మార్కెట్‌కు యుద్ధ భయాలు.. ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్

స్టాక్‌ మార్కెట్లను యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.

Stock Market: స్టాక్‌ మార్కెట్‌కు యుద్ధ భయాలు.. ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్
Stock Market Crash
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2024 | 4:08 PM

Share

స్టాక్‌ మార్కెట్లను యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 1700లకు పైగా పాయింట్ల నష్టంతో ట్రేడవ్వగా.. నిఫ్టీ 500 పైగా పాయింట్లు కోల్పోయింది. టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. స్టాక్ మార్కెట్ సమయం ముగిసే నాటికి.. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లు ఆవిరయ్యారు. ఒక్కరోజే ఇంత మొత్తంలో స్టాక్ మార్కెట్ పడిపోవడంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

మశ్చిమాసియాలోని ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి. ముడి చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల భయానికి మరో కారణం. ఇన్నాళ్లు 70-71 డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్‌ ముడి చమురు ధర 75 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

సమయం ముగిసే నాటికి..

స్టాక్ మార్కెట్ల సమయం ముగిసే నాటికి మధ్యాహ్నం 3:30 గంటలకు .. సెన్సెక్స్ 1,729 పాయింట్లు.. 2.05% క్షీణించి 82,536 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 529 పాయింట్లు 2.05% క్షీణించి 25,266 వద్ద ట్రేడవుతోంది.. బ్యాంక్ నిఫ్టీ 1,086 పాయింట్లు 2.05% పడిపోయి 51,836 ట్రేడ్ అయింది.

ఇదిలాఉంటే.. ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనలను ఇటీవల సెబీ కఠినతరం చేయడం కూడా మార్కెట్‌ నష్టాలకు మరో కారణం. చైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశానికి చెందిన స్టాక్స్‌ రాణిస్తున్నాయి. దీంతో భారత్‌ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయన్న ఆందోళనలు నెలకున్నాయి.

ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంతో..

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భయాల మధ్య.. స్టాక్ మార్కెట్లు మరికొన్ని రోజులు ఇలానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కాగా.. హిజ్బుల్లా హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా.. తమ పై దాడి చేసిన వారిని వదిలిపెట్టమని.. ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని ప్రతిజ్ఞ చేసింది.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..