AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు సమర్పణకు కొత్త డెడ్ లైన్ ఇదే.. త్వరపడండి..

ఆడిట్ నివేదికలు అందజేయడానికి గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయం తీసుకుంది. 2023-24 అసస్ మెంట్ సంవత్సరానికి సంబంధించి వివిధ ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి ఈ అవకాశం కల్పించింది. అసలు తేదీ సెప్టెంబర్ 30 కాగా, దాన్ని అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగించింది.

Income Tax: ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు సమర్పణకు కొత్త డెడ్ లైన్ ఇదే.. త్వరపడండి..
Income Tax
Madhu
|

Updated on: Oct 03, 2024 | 4:23 PM

Share

ఆదాయపు పన్నును సకాలంలో చెల్లించడం, అవసరమైన పత్రాలను సమర్పించడం పన్ను చెల్లింపుదారులు ప్రథమ కర్తవ్యం. ఆ శాఖ విధించిన గడువులోపు వీటిని అందజేయడం వల్ల పన్ను గణన సక్రమంగా, సకాలంలో పూర్తవుతుంది. దాని వల్ల పన్నుచెల్లింపుదారులకు ఒత్తిడి తగ్గుతుంది. సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లింపునకు జూలై 31 వరకూ గడువు ఉంటుంది. అయితే ఆడిట్ నివేదికలు అవసరమైన వ్యక్తలు, సంస్థలకు అక్టోబర్ 31. అయితే ఆడిట్ నివేదికలను మాత్రం సెప్టెంబర్ 30లోపు ఆ శాఖ కు అందజేయాలి. ఈ నిబంధన ప్రకారం ఆడిట్ నివేదికలకు ప్రస్తుతం గడువు ముగిసి పోయింది. అయితే పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం అక్టోబర్ 7వ తేదీ వరకూ గడువు పొడిగించారు.

సీబీడీటీ నిర్ణయం..

ఆడిట్ నివేదికలు అందజేయడానికి గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయం తీసుకుంది. 2023-24 అసస్ మెంట్ సంవత్సరానికి సంబంధించి వివిధ ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి ఈ అవకాశం కల్పించింది. అసలు తేదీ సెప్టెంబర్ 30 కాగా, దాన్ని అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగించింది. ఇ-ఫైలింగ్ చేయడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఆదాయపు పన్ను చట్టంలోని 119 సెక్షన్ కింద సీబీడీటీకి ఈ అధికారం ఉది. ఆడిట్ నివేదికలు దాఖలు చేయడానికి గడువును పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి లేకుండా ఇ-ఫైలింగ్ చేసుకోవచ్చు.

జరిమానా..

నిబంధనల ప్రకారం ఆడిట్ నివేదికలు సమర్పించని వ్యక్తలు, కంపెనీలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271 బి కింద జరిమానాలు విధిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ ఆ ఆర్ధిక సంవత్సరంలో జరిగిన వ్యాపారం లావాదేవీలు, టర్నోవర్ లేదా స్థూల రశీదులలో 0.5 శాతం జరిమానా ఉంటుంది. మొత్తం గరిష్ట జరిమానా రూ.1.50,000 వరకూ విధిస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలను ఆడిట్ చేయకపోవడానికి సహేతుకమైన కారణం ఉందని రుజువు చేస్తే జరిమానాను మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.

ఎవరికి అవసరం అంటే..

వ్యాపారం.. ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయలకు మించి టర్నోవర్ జరిగే వ్యాపారాలు, కంపెనీల యజమానులు తమ ఖాతాలను ఆడిట్ చేయించాలి.

ప్రొఫెషనల్స్.. వైద్యులు, ఆర్టిటెక్ లు, లాయర్లు తదితర ఫ్రొఫెషనర్లు ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే ఆడిట్ అవసరం.

ఊహాజనిత పన్నుల పథకం.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ఏడీ కింద ఊహాజనిత పన్నుల పథకాన్ని ఎంచుకున్న చెల్లింపు దారులు టర్నోవర్ లో 8 శాతం కంటే తక్కువ లాభాలను ప్రకటిస్తే, వారి మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే ఆడిట్ చేయించాలి.

  • స్థూల రశీదులలో 50 శాతం కంటే తక్కువ లాభాలను ప్రకటిస్తూ, ప్రాథమిక మినహాయంపు పరిమితికి మించి ఆదాయం కలిగిన ప్రొఫెషనల్స్ అందజేయాలి.
  • ఆడిట్ నివేదకను ఆదాయపు పన్ను శాఖ తయారు చేయదు. అనుభవం ఉన్న సీఏలతో పన్ను చెల్లింపుదారులే తయారు చేయించుకోవాలి. దాని కోసం వారికి కొంత ఫీజు చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ