US Visa: భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. మీ కల సాకారానికి సువర్ణావకాశం..

భారతీయులకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. వివిధ పనులపై తమ దేశానికి రావాలనుకునే వారికి స్వాగతం పలుకుతోంది. వీసా మంజూరు లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. అలాగే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కల్పిస్తోంది. దానిలో భాగంగా మన దేశంలోని యూఎస్ ఎంబసీ 2.50 లక్షల వీసా స్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

US Visa: భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. మీ కల సాకారానికి సువర్ణావకాశం..
Us Visa
Follow us

|

Updated on: Oct 03, 2024 | 5:27 PM

భారతీయులకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. వివిధ పనులపై తమ దేశానికి రావాలనుకునే వారికి స్వాగతం పలుకుతోంది. వీసా మంజూరు లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. అలాగే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కల్పిస్తోంది. దానిలో భాగంగా మన దేశంలోని యూఎస్ ఎంబసీ 2.50 లక్షల వీసా స్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా భారతీయ పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. ఎక్కువ స్లాట్ లు పెంచడం వల్ల ఎక్కువ మంది అమెరికా వెళ్లడానికి వీలుంటుంది.

ఎక్కువ మందికి అవకాశం..

మన దేశంలో అమెరికా రాయభారి అయిన ఎరిక్ గార్సెట్టి ఈ విషయంపై మాట్లాడుతూ వీసాల ప్రక్రియను మెరుగుపర్చడానికి, వేగవంతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు జోబెడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విషయంలో తాము వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది స్టూడెంట్ వీసా సీజన్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు. మొదటిసారి వెళుతున్న విద్యార్థులందరికీ దాదాపు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

రికార్డు స్థాయిలో..

ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకూ 1.2 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. 2023 లో ఇదే సమయానికి పోల్చితే దాదాపు 35 శాతం ఎక్కువ. కనీసం ఆరు మిలియన్ల మంది భారతీయులు ఇప్పటికే యూఎస్ కు వలసేతర వీసాలను కలిగి ఉన్నారు.

ఎఫ్1 వీసా..

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఎఫ్ 1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని నాన్ – ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అంటే వీసా గడువు ముగిసిన తర్వాత స్వదేశానికి తప్పకుండా తిరిగి వెళ్లిపోవాలి. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) ఆమోదించిన సంస్థ నుంచి అంగీకార పత్రం అవసరమవుతుంది. మీకు మంజూరు చేసే వీసా కూడా మీ కోర్సు వ్యవధికి అనుగుణంగా ఉంటుంది.

వీసా స్లాట్ అంటే..

ఎఫ్ 1 వీసాకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ యూఎస్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందుకోెసం అపాయింట్ మెంట్లు కేటాయిస్తారు. వాటినే స్లాట్లు అంటారు. ఆ సమయంలో దేశంలోని అమెరికా అధికారులను కలివాలి. అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ స్లాట్లు కేటాయించడం వల్ల అవకాశాలు పెరుగుతాయి.

ఆస్ట్రేలియా శుభవార్త..

ఆస్ట్రేలియా కూడా తమ దేశానికి రావాలనుకునే భారతీయులకు శుభవార్త చెప్పింది. మన దేశంతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయులకు వర్క్ వీసాలు మంజూరు చేయనుంది. దీనిలో భాగంగా ఏటా 1000 వరకూ వర్క్ , హాలీడే వీసాలను మంజూరు చేయనుంది. అక్టోబర్ ఒకటి నుంచే వీసాల మంజూరుకు కార్యాచరణ చేపట్టింది. మనకు, ఆస్ట్రేలియాకు మధ్య ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఏఐ-ఈసీటీఏ) 2022 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం. మన దేశంలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారందరూ ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి, పని చేసుకోవడానికి, పర్యటించడానికి ఏడాది వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో