Star Health IPO: నవంబర్ 30న స్టార్ హెల్త్ ఐపీఓ.. షేరు ధర రూ.870-900..

స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చే వారం ఐపీఓగా రాబోతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 15.8 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థల్లో స్టార్ హెల్త్ ఒకటి...

Star Health IPO: నవంబర్ 30న స్టార్ హెల్త్ ఐపీఓ.. షేరు ధర రూ.870-900..
Ipo
Follow us

|

Updated on: Nov 28, 2021 | 7:03 AM

స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చే వారం ఐపీఓగా రాబోతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 15.8 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థల్లో స్టార్ హెల్త్ ఒకటి. ఈ ఐపీఓ నవంబర్ 30న ప్రారంభం అయి డిసెంబర్ 02, 2021న ముగుస్తుంది. రాకేష్ ఝున్‌జున్‌వాలా ప్రమోట్ చేసిన కంపెనీ ఆఫర్‌కు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.870-900గా నిర్ణయించారు. స్టార్ హెల్త్ ఈ IPO ద్వారా రూ. 7,249.18 సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 2,000 కోట్ల విలువైన షేర్ల తాజా జారీ, అనేక మంది వాటాదారులకు 5.83 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది. OFS ద్వారా, ప్రమోటర్ సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP 3.07 కోట్ల షేర్లను కేటాయిస్తారు. ఈ ఆఫర్‌లో కంపెనీ ఉద్యోగులకు రూ.100 కోట్ల విలువైన షేర్ల రిజర్వేషన్ కూడా ఉంది.

ఐపీఓలో లాట్ సైజ్‎లో షేర్లు కొనాల్సి ఉంటుంది. ఒక్కో లాట్‎లో 16 షేర్లు ఉంటాయి. ఒక్క లాట్ కొనాలంటే రూ.14,400 పెట్టుబడి పెట్టాలి. ఒక్కరు గరిష్ఠంగా 13 లాట్‎లను(208 షేర్లు) రూ.1,87,200 అవుతుంది. CRISIL రీసెర్చ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, స్టార్ హెల్త్ 15.8 శాతం మార్కెట్ వాటాతో భారతీయ ఆరోగ్య బీమా మార్కెట్లో అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థగా ఉంది. FY21, FY22 మొదటి సగంలో, ఇది వరుసగా రూ. 9,348.95 కోట్లు కంపెనీ ప్రధానంగా రిటైల్ ఆరోగ్యం, సమూహ ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాదం, విదేశీ ప్రయాణాల కోసం సౌకర్యవంతమైన, సమగ్రమైన కవరేజ్ ఎంపికలను అందిస్తుంది. FY21లో రిటైల్ హెల్త్, గ్రూప్ హెల్త్ మొత్తం GWPలో 87.9 శాతం మరియు 10.5 శాతంగా ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలోని ఆరోగ్య బీమా పరిశ్రమకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ కీలకమైన వృద్ధిని అందిస్తుంది.

రాకేష్ జున్‌జున్‌వాలా, సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP మరియు వెస్ట్‌బ్రిడ్జ్ AIF సహా ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ ప్రస్తుతం కంపెనీలో 66.22 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 33.78 శాతం వాటా పబ్లిక్ వాటాదారులకు కేటాయించారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP 47.77 శాతం వాటాతో ప్రధాన వాటాదారుగా ఉంది.

Read Also.. Gold Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!