AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..

మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారా ? మీకు నెలకు మంచి జీతం వస్తుందా ? అయితే ఈ వార్తా మీకోసమే. మీ భవిష్యత్తులో

EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ రింగ్ అయిన తర్వాత వెంటనే మీ కాల్ డిస్ కనెక్ట్ అవుతుంది.
Rajitha Chanti
| Edited By: Team Veegam|

Updated on: Apr 19, 2021 | 10:07 PM

Share

మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారా ? మీకు నెలకు మంచి జీతం వస్తుందా ? అయితే ఈ వార్తా మీకోసమే. మీ భవిష్యత్తులో డబ్బును భద్రతపరచడానికి అదనపు జీతాన్ని ఇపిఎప్ కు ట్రాన్స్ ఫర్ చేయ్యోచ్చు. ఏప్రిల్ నెలలో ఇలా జీతాన్ని ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. మీరు పనిచేసే సంస్థలో మీ జీతం పెరిగినా.. ఆ సమయంలో అందులో నుంచి కొంత అమౌంట్ ను ఇపిఎఫ్ కు బదిలి చేయవచ్చు. ఇది పదవి విరమణ తర్వాత ఒకేసారి ఈ అమౌంట్ వడ్డీతో సహా తీసుకోవచ్చు.

మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఏప్రిల్ నెల నుంచి ఇపిఎఫ్ డబ్బును మరింత రెట్టింపు చేసుకోవచ్చు. మీ epf ఖాతాకు pf సహకారాన్ని పెంచవచ్చు. దీని ద్వారా మీకు వచ్చే జీతం తగ్గినా.. కానీ పొదుపు, పన్నుల పరంగా ఇది మంచి ఆప్షన్. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) 8.55 శాతం వడ్డీని అందిస్తుంది. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాక, పన్నులలో కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగులు వారి నెలవారీ సహకారాన్ని 100% ప్రాథమిక వేతనానికి పెంచవచ్చు.

డబుల్ బెనిఫిట్..

ఉద్యోగస్తులు తమ జీతం నుంచి కొంత అమౌంట్ ను పాలసీల మాదిరిగా.. తమ ఖాతా నుంచి నేరుగా డబ్బును జమ చేయవచ్చు. ఇలా వారు తమ పిఎఫ్ ఖాతాలో జమ చేయడం ద్వారా పన్నులతో సహా మరిన్ని ప్రయోజానాలను పొందవచ్చు. ఇపీఎఫ్ పై సంపాదించిన వడ్డీ సమ్మేళనం వడ్డీ. అందువల్ల , ప్రతి సంవత్సరం ఎక్కువ డబ్బు జమ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీని సంపాదించే అవకాశం కూడా ఉంది. పిఎఫ్‌పై వడ్డీని సమ్మేళనం వడ్డీ సూత్రం ద్వారా లెక్కిస్తారు.

వడ్డీ ఎలా లెక్కించబడుతుంది?

ప్రతి నెల EPF ఖాతాలో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అయితే ఇది సంవత్సరం చివరిలో ఖాతాకు జమ అవుతుంది. EPFO ఎల్లప్పుడూ ఖాతా ప్రారంభ, ముగింపు బ్యాలెన్స్ తీసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ లెక్కించబడుతుంది. సంవత్సరంలో ప్రతి నెల చివరి రోజున బ్యాలెన్స్ యాడ్ చేయడం ద్వారా, వడ్డీ మొత్తాన్ని నిర్ణీత వడ్డీ రేటు కంటే 1200 రెట్లు గుణించడం ద్వారా లెక్కించబడుతుంది.

Also Read: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది

కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..