South Indian Bank: రుణగ్రహీతలకు షాక్‌ ఇచ్చిన సౌత్ ఇండియన్ బ్యాంక్.. లోన్ల వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడి..

ప్రైవేట్ రంగ బ్యాంక్‌ సౌత్ ఇండియన్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 0.20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ కొత్త వడ్డీ రేట్లు సోమవారం జూన్ 20 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది...

South Indian Bank: రుణగ్రహీతలకు షాక్‌ ఇచ్చిన సౌత్ ఇండియన్ బ్యాంక్.. లోన్ల వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడి..
Bank
Follow us

|

Updated on: Jun 19, 2022 | 11:13 AM

ప్రైవేట్ రంగ బ్యాంక్‌ సౌత్ ఇండియన్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 0.20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ కొత్త వడ్డీ రేట్లు సోమవారం జూన్ 20 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో MCLR వడ్డీ రేట్లలో వివిధ అవధులతో చేసిన మార్పులు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. మార్పు తర్వాత గతంలో 8.15 శాతంగా ఉన్న MCLR ఇప్పుడు 8.35 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. వాహన రుణాలు, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లు ఏదైనా బ్యాంకు MCLR ఆధారంగా నిర్ణయిస్తారు. ఒక సంవత్సరం కాలపరిమితి MCLRతో పాటు, బ్యాంక్ ఒక రాత్రి, ఒక నెల, మూడు నెలల, ఆరు నెలల MCLRని కూడా మార్చింది.

ఒక నెల కాలవ్యవధికి సంబంధించిన MCLR రేట్లు 7.85 శాతానికి పెంచారు. 3 నెలల కాలపరిమితి కలిగిన MCLR రేట్లు 7.95 శాతానికి పెరిగాయి. 6 నెలల కాలవ్యవధి కోసం MCLR రేట్లు ఇప్పుడు 8.05 శాతానికి పెరిగాయి. అయితే బ్యాంక్ ఇప్పుడు ఒక సంవత్సరం టేనార్ MCLR రేట్లను 8.35 శాతానికి పెంచింది. జూన్ 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. జూన్ 8న ఆర్‌బీఐ రెపో రేటును 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెంచింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత, దేశంలోని అన్ని బ్యాంకులు కూడా రుణాల వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా రుణాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు