Nominee: డీమ్యాట్ ఖాతాకు నామినీ జ‌త‌చేశారా?.. లేకుంటే వెంటనే చేయండి..

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలాన్నా.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలాన్నా డీమ్యాట్‌ అకౌంట్‌ కావాలి. డీమ్యాట్‌ ఖాతా తెరిచిన వారు దానికి నామినీని యాడ్‌ చేయాలి...

Nominee: డీమ్యాట్ ఖాతాకు నామినీ జ‌త‌చేశారా?.. లేకుంటే వెంటనే చేయండి..
Demat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 19, 2022 | 10:08 AM

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలాన్నా.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలాన్నా డీమ్యాట్‌ అకౌంట్‌ కావాలి. డీమ్యాట్‌ ఖాతా తెరిచిన వారు దానికి నామినీని యాడ్‌ చేయాలి. ఆన్‌లైన్ లేదా ఆన్‌లైన్ పెట్టుబ‌డి ఫారం నింపేట‌ప్పుడు నామినికి సంబంధించిన కాల‌మ్‌ను ఖాళీగానే వ‌దిలేస్తుంటారు. లేదా నామ‌మాత్రంగా కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రి పేరు రాస్తారు కానీ స‌మ‌యానుకూలంగా అప్‌డేట్ చేయ‌టం మ‌ర్చిపోతుంటారు అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల భ‌విష్యత్తులో స‌మ‌స్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డీమ్యాట్ ఖాతా పెట్టుబ‌డిదారుడు మ‌ర‌ణిస్తే, అత‌ని ఖాతాలోని షేర్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ట్టబ‌ద్ధమైన వార‌సుల‌కు అందించ‌డంలో నామినీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక విష‌యం గుర్తించుకోవాలి. నామినీ, చ‌ట్టబ‌ద్ధమైన వార‌సులు వేర్వేరు. పెట్టుబ‌డులు చ‌ట్టబ‌ద్ధమైన వార‌సుల‌కు చేర్చడంలో నామినీ వారిధిగా ఉంటారు. అందువ‌ల్ల నామినీగా సొంత‌వారినే నియ‌మించాల్సి అవ‌స‌రం లేదని గుర్తుంచుకోవాలి. బ‌య‌టి వ్యక్తుల‌ను కూడా నియ‌మించుకోవ‌చ్చు. అయితే సాధ్యమైనంత వ‌ర‌కు చ‌ట్టబ‌ద్ధమైన వార‌సుల‌నే నామినీలుగా నియ‌మించ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తారు.

ఒక‌వేళ పెట్టుబ‌డిదారుడు నామినీని నియ‌మించ‌కుండానే మ‌ర‌ణిస్తే, షేర్ల బ‌దిలీ స‌మ‌యంలో ఆధారిత కుటుంబ స‌భ్యులు బ‌దిలీ కోసం కొంత క‌ష్టప‌డాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతీ సెక్యూరిటీకి సంబంధించిన‌, అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాల‌తో పాటు, బ‌దిలీ కోసం ప్రతేక ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ర‌ణించిన వ్యక్తి చ‌ట్టబ‌ద్ధమైన వార‌సులుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పెట్టుబ‌డిదారుడు రాసిన వీలునామా గానీ, వార‌స‌త్వ ధృవీక‌ర‌ణ ప‌త్రం గానీ ఇవ్వాలి. ఇందుకు స‌మ‌యంతో పాటు కొంత డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సి రావచ్చు. ముందుగా మీ డీమ్యాట్ ఖాతాకు నామినీని జ‌త చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీ డీమ్యాట్ ఖాతా క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ లేదా ఖాతా స్టేట్‌మెంటును చెక్‌చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ ఇప్పటికే నామినీ వివ‌రాలు ఇచ్చి వుంటే ప‌ర్వాలేదు. ఒక‌వేళ ఇవ్వక‌పోయినా, నామినీని అప్‌డేట్ చేయాల‌నుకున్నా.. నామినేష‌న్ ఫారంను పూర్తి చేసి మీ డిపాజిట‌రీ పార్టిసిపెంట్‌(డిపి)కి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.