Mercedez Vs SIP: సిప్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ కామెంట్స్‌పై ఆటాడుకుంటున్న నెటిజన్స్‌

కోవిడ్ పీరియడ్ తర్వాత ఇండియాలో లగ్జరీ కార్ల రంగంలో వేగంగా వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, భారత్‌ ఆర్థిక సామర్థ్యానికి తగిన స్థాయిలో అమ్మకాలు లేవని మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్..

Mercedez Vs SIP: సిప్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ కామెంట్స్‌పై ఆటాడుకుంటున్న నెటిజన్స్‌
Mercedes Benz
Follow us
Sukumaar DG - Associate Editor

| Edited By: Subhash Goud

Updated on: Nov 30, 2022 | 3:32 PM

కోవిడ్ పీరియడ్ తర్వాత ఇండియాలో లగ్జరీ కార్ల రంగంలో వేగంగా వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, భారత్‌ ఆర్థిక సామర్థ్యానికి తగిన స్థాయిలో అమ్మకాలు లేవని మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్ హెడ్ సంతోష్‌ అయ్యర్ టైమ్స్‌ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే జనవరిలో ఆయన కంపెనీ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతీ నెలా దాదాపు 15000 మంది లగ్జరీ కార్లకు గురించి ఎంక్వయిరీ చేస్తున్నారని, అయితే 1500 కార్లు (యూనిట్లు) మాత్రమే అమ్ముడవుతున్నాయని, ఇంకా 13500 మందికి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొనాలనే కోరిక ఉన్నప్పటికీ వారు కారు కొనాలనుకునే ఆలోచనను వాయిదా వేసుకొని దాని బదులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ (సిప్‌)లో లేదా షేర్‌ మార్కెట్ డిప్ ( కనిష్ట స్థాయిలో)లో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిదని భావిస్తున్నారు.

సేల్స్‌ గ్రోత్ వృద్ధి రేటు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సిప్‌ సమస్యపై దృష్టిసారించాలని అయ్యర్ కంపెనీ సేల్స్‌ టీమ్‌ని కోరారు. సిప్‌లు మనీకి ముఖ్య పోటీదారులు. భారత్ ప్రజల సిప్‌ల పెట్టుబడులను మనం విచ్ఛినం చేయగలిగితే చాలా పెద్ద స్థాయిలో తమ కార్ల అమ్మకాల పెరుగుదల సాధించవచ్చని ఆయన అన్నారు.

సిప్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీకి చాలా గట్టి పోటీ ఇస్తోందని ఎడిల్‌ వైజ్‌ సీఈఓ రాధిక గుప్త ట్వీట్‌ చేశారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ (SIP)లను లగ్జరీ కార్లను పోల్చడంపై మెర్సిడెజ్‌ ఇండియా టాప్‌ ఎ్గజిక్యూటివ్‌ను చాలా మంది ట్విట్టర్‌ యూజర్లు హేళన చేస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌ నిద్రతో పోటీ పడుతుందని, ఇప్పుడు మెర్సిడెజ్‌ కంపెనీ సిప్‌లవిధానం పై ఫిర్యాదు చేస్తోందని మరో యూజర్‌ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇండియాలో రోడ్లపై మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్ డ్రైవ్ చేయడంల కంటే SIPలో పెట్టుబడితో పెద్ద ఎత్తున్న రిటర్న్‌లతో పాటు మానసిక ప్రశాంతత ఉంటుందని, ఈ విషయం ఈ ఎంబీఏ గ్రాడ్యుయేట్ కి ఎవరైనా చెప్పండంటూ ఆనంద్ శంకర్‌ ట్వీట్‌ చేశారు. మనం మన కుటుంబ, పిల్లల భవిష్యత్‌ని వదిలేసి లగ్జరీ కార్లను కొనాలని మెర్సిడెజ్‌ కంపెనీ కోరుకుంటోంది. ఇది చాలా అసహజమని నీల్ బహల్ ట్వీట్‌ చేశారు.

 DG Sukumaar Associate Editor Tv9

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి