Silver Price Today: వెండి కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్లు..
Silver Price Today
Follow us

|

Updated on: Feb 02, 2022 | 6:22 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర 61,300 గా ఉంది. కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,300 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,300 లుగా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,400లుగా ఉంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర 61,300 లుగా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది. * కేరళలో కిలో వెండి ధర 65,400 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,400లు వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Budget 2022: బడ్జెట్‌లో వాహనదారులకు శుభవార్త అందనుందా..? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది