Silver Price Today: పెరిగిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే..

Silver Price Today: పెరిగిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!
Follow us

|

Updated on: Nov 26, 2021 | 6:23 AM

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏ మాత్రం ఆగవు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా శుక్రవారం బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.200 వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 62,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 62,900 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కోల్‌కతాలో రూ.62,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, విజయవాడలో రూ.67,800 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, మధురైలో రూ.67,800 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు..!

Crypto Currency Crisis: పార్లమెంటు ముందుకు బిల్లు.. క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు..!