Crypto Currency Crisis: పార్లమెంటు ముందుకు బిల్లు.. క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..!
రూపం లేని కరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ అనేది ఇప్పుడు భారత యువతలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బంగారంలో పెట్టుబడులు పెట్టాలా? బిట్‌కాయిన్‌లో మదుపు చేయాలా? అనే దానిపై విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.
Former RBI Director Raghuram Rajan on Crypto Currency: రూపం లేని కరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ అనేది ఇప్పుడు భారత యువతలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బంగారంలో పెట్టుబడులు పెట్టాలా? బిట్‌కాయిన్‌లో మదుపు చేయాలా? అనే దానిపై విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు దాటిందని అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు.. క్రిప్టోకరెన్సీ యువత చేతుల్లోకి వెళితే వారిని చెడగొడతాయని.. వీటి నియంత్రణపై ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. దీనిపై వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నియంత్రణ బిల్లు తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్రిప్టోకరెన్సీ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై బ్యాన్ విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పలుమార్లు క్రిప్టో కరెన్సీ వల్ల దేశ ఫైనాన్షియల్, ఆర్థిక స్థిరత్వాలకు విఘాతం కలుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నతస్థాయి సంఘం క్రిప్టో కరెన్సీని నిషేదం విధించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే క్రిప్టో కరెన్సీ బ్యాన్ పై భారతీయుల అభిప్రాయం ఎలా ఉందో’ తెలుసుకునేందుకు పలు సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాయి.
మరోవైపు, దేశవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. తాజాగా క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్‌ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో అభివర్ణించారు.
క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో రఘురాం రాజన్ పోల్చారు. చిట్‌ఫండ్స్ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు విలువే లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని.. వాటిలో కూడా క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు. భారత్‌లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీలను కల్గి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Read Also… Big News Big Debate: వరద బీభత్సంతో నామరూపాల్లేకుండా పోయిన గ్రామాలు.. ఈ విపత్తు మానవతప్పిదమా..?