Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో కిలో ధర ఎంత ఉందంటే..?

Silver rate Today: దేశంలో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యం బంగారం ధరలకు మాత్రం

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో కిలో ధర ఎంత ఉందంటే..?
Silver Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2021 | 5:46 AM

Silver rate Today: దేశంలో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యం బంగారం ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతుంటాయి. బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం చోటుచేసుకుంటుంది. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. కాగా బుధవారం కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండికి రెండు వేల రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 72,000 నుంచి 74,000లకు ఎగబాకింది. కాగా.. తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000 లు ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.74,000 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.74,000 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.78,500 లు ఉంది. విజయవాడలో వెండి రూ.78,500లు వద్ద కొనసాగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వెండి ధరలు చెన్నైలో మాదిరిగానే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.

Also Read:

ముంబైలో 953 కోవిడ్ కేసుల నమోదు, మొదటిసారిగా అతి తక్కువన్న ప్రభుత్వం, ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్

సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!