Home loans: హోమ్ లోన్ కడుతుండగానే ఫ్లాట్ ను విక్రయించలా…? నిబంధనలు ఏంటంటే..?
ప్రతి ఒక్కరూ జీవితంలో అనేక లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత చదువు, మంచి ఉద్యోగం వాటిలో ప్రధానంగా ఉంటాయి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరతారు. ఆ సమయంలో సొంతూరిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రారంభించిన వారి మొదటి లక్ష్యం సొంతింటిని సమకూర్చుకోవడం. ఆ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
ప్రతి ఒక్కరూ జీవితంలో అనేక లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత చదువు, మంచి ఉద్యోగం వాటిలో ప్రధానంగా ఉంటాయి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరతారు. ఆ సమయంలో సొంతూరిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రారంభించిన వారి మొదటి లక్ష్యం సొంతింటిని సమకూర్చుకోవడం. ఆ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా విస్తరించిన నేపథ్యంలో ఇల్లు సమకూర్చుకోవడానికి అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అందమైన ఫ్లాట్లను నెలవారీ వాయిదాలు చెల్లించేలా కొనుగోలు చేసుకోవచ్చు. నిర్ణీత ఆదాయం ఉంటే బ్యాంకులు మీకు రుణాన్ని మంజూరు చేస్తాయి. ప్రతినెలా బ్యాంకుకు వాయిదాలు కడితే సరిపోతుంది. దీనికి దాదాపు 15 నుంచి 20 ఏళ్ల వరకూ సమయం ఉంటుంది. అయితే మీరు హోమ్ లోన్ వాయిదాలు కడుతుండగానే ఫ్లాట్ విక్రయించాల్సి అవసరం రావచ్చు. ఆ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలా సులువుగా ఆ పని జరుగుతుంది.
హోమ్ లోన్లు
సొంతింటి కొనుగోలుకు నేడు దాదాపు అందరూ బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్ల మీద ఆధారపడుతున్నారు. చాలా సులభ వాయిదాలతో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉండడమే దీనికి కారణం. ప్రతినెలా అద్దె కడుతున్నట్టుగా ఈఎంఐ చెల్లిస్తే రుణం క్రమంగా తీరిపోతుంది. నిర్ణీత ఆదాయం ఉంటే ఈ రోజుల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవడం చాలా సులభమే. రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు అన్ని సౌకర్యాలతో అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. వాటిలోని ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి బ్యాంకులు రుణాలిస్తాయి. ఆ రుణాన్ని వడ్డీతో కలిసి నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి.
ఈ జాగ్రత్తలు అవసరం
- ఒక్కోసారి హోమ్ లోన్ వాయిదాలు కడుతుండగానే ఫ్లాట్ ను విక్రయించే అవసరం కలగవచ్చు. అలాంటప్పుడు ఏమి చేయాలి, వేరొకరికి అమ్మడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
- మీరు రుణం తీసుకున్న బ్యాంకు, ఫైనాన్స్ సంస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటే హోమ్ లోన్ మిగిలి ఉన్నా ఆస్తిని విక్రయించడం సాధ్యమవుతుంది.
- ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి అదే బ్యాంకులో రుణం తీసుకోవాలని భావిస్తే ఆ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. బ్యాంకు ఆస్తి పత్రాలను వేరే రుణదాతకు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు.
- కొనుగోలుదారుడు మొత్తం డబ్బులు చెల్లించి ఫ్లాట్ ను కొనుగోలు చేయాలనుకుంటే, అతడే ఆ డబ్బును బ్యాంకుకు చెల్లించవచ్చు.
- హోమ్ లోన్, దానిపై ఇతర బకాయిలు తీరిన తర్వాతే ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలను విడుదల చేస్తారు.
- మీరు బకాయి ఉన్నహెమ్ లోన్ మొత్తాన్ని తనిఖీ చేయాలి. దాన్ని క్లియర్ చేయడానికి మీ దగ్గర ఎంత సరిపడే డబ్బు ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించే అవకాశం లేకపోతే రుణదాతతో చర్చించారు. హోమ్ లోన్ ను చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశముందేమో పరిశీలించాలి.
- హోమ్ లోన్ చెల్లించిన తర్వాత రుణదాత నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవడం చాలా అవసరం. ఆ ఆస్తిపై అమ్మకంపై ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలియజేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి