GST Reform: ఇక షూస్, చెప్పులు, బట్టలు మరింత చౌకగా.. వెలువడనున్న కీలక ప్రకటన
GST Reform: జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ), రూ.2,500 వరకు పాదరక్షలు, దుస్తులకు సంబంధించిన వాటిపై ధరలు మరింత తగ్గనున్నాయి. అయితే దీని అధికారిక ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చేస్తారు..

GST Reform: 2025 జీఎస్టీ సంస్కరణలో పాదరక్షలు, బట్టలు కూడా చౌకగా మారవచ్చు. రూ.2,500 వరకు ధర ఉన్న పాదరక్షలు, దుస్తులను 5 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉంచాలని బుధవారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటివరకు, రూ.1,000 వరకు ధర ఉన్న పాదరక్షలు, దుస్తులపై మాత్రమే 5 శాతం పన్ను విధించగా, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులకు 12 శాతం పన్ను విధించారు.
ఇది కూడా చదవండి: Gold Rate: సామాన్యులకు అదిరిపోయే శుభవార్త.. తులం బంగారం ధర రూ.36 వేలు!
జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ), రూ.2,500 వరకు పాదరక్షలు, దుస్తులకు సంబంధించిన వాటిపై ధరలు మరింత తగ్గనున్నాయి. అయితే దీని అధికారిక ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చేస్తారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Smartphone: ఈ ఆరు యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.. ఉపయోగం ఏంటో తెలుసా?
వినియోగదారులకు ప్రత్యక్ష ఉపశమనం:
ఈ సమావేశంలో 12, 28 శాతం పన్ను శ్లాబులను రద్దు చేయాలని కూడా నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ రెండు వర్గాలలోని చాలా ఉత్పత్తులు వరుసగా 5, 18 శాతం శ్లాబులకు బదిలీ అవుతాయి. ఈ దశ వినియోగదారులకు ప్రత్యక్ష ఉపశమనం కలిగించడంతో పాటు దుస్తులు, పాదరక్షల పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








