Zomato: పండగలకు ముందు కస్టమర్లకు షాకిచ్చిన జోమాటో.. భారీగా పెంచిన ఫీజు!
Zomato: పండగ సీజన్ ప్రారంభం కాకముందే ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ కంపెనీ జొమాటో తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు జొమాటో ప్లాట్‌ఫామ్ రుసుమును కూడా పెంచింది..

Zomato Fee Hikes: ఈ రోజులలో ఏదైనా ఫుడ్ కావాలంటే నిమిషాల్లోనే డెలివరీ అవుతుంటుంది. అయితే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక పండగ సీజన్ ప్రారంభం కాకముందే ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ కంపెనీ జొమాటో తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. జొమాటో మంగళవారం తన ప్లాట్‌ఫామ్ ఫీజును 20 శాతం పెంచింది. ఎటర్నల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజును మునుపటి ఆర్డర్‌కు రూ.10 నుండి రూ.12కి పెంచింది.
ఇది కూడా చదవండి: Gold Rate: సామాన్యులకు అదిరిపోయే శుభవార్త.. తులం బంగారం ధర రూ.36 వేలు!
జొమాటో ఆహారాన్ని డెలివరీ చేసే అన్ని నగరాల్లో కస్టమర్లకు ఫీజుల పెంపు జరిగింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ గత నెలలో ఎంపిక చేసిన ప్రదేశాలలో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.14కి పెంచిన తర్వాత జొమాటో ఈ పెంపు నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Smartphone: ఈ ఆరు యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.. ఉపయోగం ఏంటో తెలుసా?
గత సంవత్సరం కూడా పండుగ సీజన్‌లో ఫీజులు పెంపు:
గత సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు జొమాటో ప్లాట్‌ఫామ్ రుసుమును కూడా పెంచింది. గత సంవత్సరం కంపెనీ ఆర్డర్ కు రూ.6 నుండి రూ.10 కి రుసుమును పెంచింది. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీ తన ప్లాట్‌ఫామ్ రుసుమును ఆర్డర్ కు రూ.5 నుండి రూ.6 కి పెంచిన 3 నెలల తర్వాత ఈ పెరుగుదల జరిగింది.
జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ నికర లాభంలో 36% వరుస క్షీణతను నివేదించింది. అంతకుముందు కంపెనీ నికర లాభం మార్చి త్రైమాసికంలో రూ.39 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.25 కోట్లుగా నమోదైంది.
ఇది కూడా చదవండి: Viral Video: రెస్టారెంట్‌కు వచ్చిన వీధి కుక్క.. చివరకు ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!
జొమాటో కంటే ముందు మరో ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ గత నెలలో ఫుడ్ డెలివరీ ఆర్డర్‌ల కోసం తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.2 పెంచింది. పండుగ సీజన్‌లో కస్టమర్ల నుండి ఆర్డర్‌లు పెరిగినందుకు కంపెనీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. పండుగ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కంపెనీ తన ఫీజును రూ.12 నుండి రూ.14కి పెంచింది.
ఫుడ్ డెలివరీ కంపెనీలు నిరంతరం తమ ఫీజులను పెంచుతూనే ఉన్నాయి. స్విగ్గీ గురించి చెప్పాలంటే దాని ఫీజు ఏప్రిల్ 2023లో రూ. 2, జూలై 2024లో రూ.6కి పెంచారు. ఆ తర్వాత అక్టోబర్ 2024లో రూ. 10గా మారింది. ఇప్పుడు దాని ఫీజు రూ. 14గా మారింది. ఈ విధంగా గత 2 సంవత్సరాలలో స్విగ్గీ తన ఫీజులను ఆశ్చర్యకరంగా భారీగా పెంచింది. స్విగ్గీ రోజుకు 20 లక్షలకు పైగా ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తుందని, ప్రస్తుత ప్లాట్‌ఫామ్ ఫీజు స్థాయిలో ఇది రోజుకు కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








