AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!

దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండగల సమయాల్లో ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందాలనే ఉద్దేశంతో.. పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సేవలను మరో నెలపాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!
Anand T
|

Updated on: Sep 03, 2025 | 2:16 PM

Share

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఆగస్టుతో ముగియనున్న గడువును నవంబర్‌ 24 వరకు పొడగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ రైల్వేశాఖ నిర్ణయంతో పండగలకు సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కానుంది.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

తిరుపతి- సాయినగర్‌ షిర్డీ మధ్య రాకపోకలు సాగించే (07637/07638) నెంబర్‌ గల ప్రత్యేక రైళ్ల సేవలను నవంబరు 24 వరకు పొడగిస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. అదేవిధంగా, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడిచే (07219/07220) నెంబర్‌ గల ప్రత్యేక రైళ్లు కూడా నవంబరు 24 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

వీటితో పాటు హైదరాబాదు-కన్యాకుమారి మధ్య నడిచే (07230/07229) నెంబర్‌ గల ప్రత్యేక రైలు, కాచిగూడ-మధురై మధ్య నడిచే (07191/07192) నెంబర్లు గల ప్రత్యేక రైళ్లను సేవలను కూడా పొడగిస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. అలాగే హైదరాబాదు-కొల్లాం మధ్య నడిచే (07193/07194) నెంబర్‌ గల ప్రత్యేక రైళ్లు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబరు చివరి వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్