Insurance To Wifes: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. దీనితో అసలు ప్రయోజనమెంత..

Insurance To Wifes: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. వారి జీవితాలను మార్చేసింది. బీమా వల్ల వచ్చే ఆర్థిక భద్రత గురించి వారికి అర్థమయ్యేలా చేసింది. ఈ కారంగా బీమా పాలసీలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది.

Insurance To Wifes: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. దీనితో అసలు ప్రయోజనమెంత..
Insurance
Follow us

|

Updated on: Mar 03, 2022 | 6:32 AM

Insurance To Wifes: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. వారి జీవితాలను మార్చేసింది. బీమా వల్ల వచ్చే ఆర్థిక భద్రత గురించి వారికి అర్థమయ్యేలా చేసింది. ఈ కారంగా బీమా పాలసీలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం దేశంలో చాలాకాలం తరువాత బీమా ప్రీమియంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది.కాకినాడకు చెందిన రాజ్ కుమార్ లాగా తమ ప్రియమైన వారి కోసం కొత్త బీమా పాలసీలు కొనేవారి సంఖ్యను పెంచుతోంది. ఇదే సమయంలో గృహిణులకు ప్రత్యేక బీమా పాలసీ వార్త విన్న రాజ్ కుమార్ తన భార్య భావనకు విడిగా పాలసీ తీసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతని సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. ఎందుకంటే గృహిణులకు ప్రత్యేకంగా పాలసీ అనేది కేవలం పేరు కోసం చేస్తున్న ప్రకటన మాత్రమే.

గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. ఇది సాధారణంగా భర్త బీమాలో భాగం. పాలసీబజార్‌తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్‌ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణులకోసం దేశంలో ఇది తొలి జీవిత బీమా పథకం. ఇప్పటి వరకు గృహిణుల జీవిత బీమా భర్తకు కూడా వర్తిస్తుంది. చాలా కంపెనీల ఇన్సూరెన్స్‌లో భర్త బీమా కవర్‌ మెుత్తంలో 50 శాతం మాత్రమే భార్యలకు కవర్ గా అందిస్తున్నాయి. భర్త ఆదాయం పెద్దగా లేకపోతే అతను తక్కువ ఖర్చుతో కవరేజ్ మెుత్తానికి బీమా చేస్తారు. అటువంటి పరిస్థితిలో భార్య కవర్ దానిలో సగం అవుతుంది. చిన్న కవర్‌ కలుగిన బీమా పాలసీల్లో ఎంపిక అవకాశం అందుబాటులో లేదు.

ఇప్పటి వరకు గృహిణుల జీవిత బీమా భర్త పాలసీ కవర్‌తో ముడిపడి ఉంది. చాలా బీమా కంపెనీల్లో భర్త బీమా కవరేజీలో భార్యలకు 50 శాతం మాత్రమే లభిస్తోంది. భర్తకు వచ్చే ఆదాయం పెద్దగా లేకుంటే తక్కువ ఖర్చుతో కూడిన కవర్‌ తీసుకుంటే అందులో సగం మొత్తాన్ని భార్యకు అందజేస్తారు. చిన్న కవర్‌తో బీమా ఎంపిక అందుబాటులో లేదు. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు అయితే.. అతని ఆదాయానికి 20 రెట్లు బీమా కవరేజ్ పొందవచ్చు. ఒకవేళ భర్త కోటి రూపాయల కవర్ పాలసీ తీసుకుంటే.. భార్యకు అసలు బీమా మొత్తం మిగలదు. ఒకవేళ భర్త కోటి కంటే తక్కువ బీమా కవర్ తీసుకుంటే.. అంటే 75 లక్షల రూపాయలు భర్త తీసుకుంటే.. అప్పుడు భార్య దాదాపు 25 లక్షల రూపాయల వరకు బీమాను తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్ లో 25 లక్షల రూపాయల మెుత్తానికి కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అందుబాటులో లేవు.

మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్‌ ప్లాన్ జీవిత భాగస్వామికి పాలసీ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా గృహిణులకు ప్రత్యేక టర్మ్ కవరేజ్ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ కింద గృహిణులకు 49.99 లక్షల రూపాయల వరకు పాలసీని ఇస్తుంది. బీమాదారుని వయసు, బీమా కాల వ్యవధిని బట్టి చెల్లించవలసిన ప్రీమియం 10 వేల నుంచి 12 వేల మధ్య ప్రారంభమౌతుంది. కరోనా సమయంలో చాలా కుటుంబాలు వారి ఇంట్లో గృహిణులను కోల్పోయాయి. దాని కారణంగా వారి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయని పాలసీ బజార్ సంస్థ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ప్రవీణ్ చౌదరి అన్నారు.

ఈ బీమాను తీసుకురావడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే గృహిణి కుటుంబానికి అందించే సహకారాన్ని విడిగా గుర్తించదగినదని సంస్థ తెలిపింది.ఇంట్లో గృహిణి మరణించడం వల్ల కుటుంబంపై ఖర్చుల భారం పెరుగుతుంది. పిల్లల సంరక్షణ కోసం భర్త వృత్తిని మారవలసి ఉంటుంది. భార్య చూసుకునే బాధ్యతలు భర్తపై పడతాయి. చాలా కాలం తర్వాత బీమా ప్రీమియంలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదైందని బీమా నియంత్రణ సంస్థ IRDAI వార్షిక నివేదిక తెలియజేస్తోంది. దేశంలో 2019-20 కాలంలో 3.76 శాతంగా ఉన్న బీమా వ్యాప్తి.. 2020-21 నాటికి 4.20 శాతానికి చేరుకుంది. బీమా వ్యాప్తి GDP, బీమా ప్రీమియం నిష్పత్తి గురించి చెబుతుంది. జీవిత బీమా గురించి అవగాహన పెరగటం వల్ల ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. 2019-20లో 5.73 లక్షల కోట్ల రూపాయల ప్రీమియం ఉండగా.. 2020-21లో 6.29 లక్షల కోట్ల రూపాయలకు ప్రీమియం పెరిగింది.

గృహిణులకు బీమా కవరేజ్ చాలా బాగుంది. కానీ.. ఈ బీమా పాలసీలోని రెండు ముఖ్యమైన షరతులు దానిని ఎక్కవ మందికి చేరువకాకుండా నిరోధిస్తున్నాయి. అవేమిటంటే.. గృహిణి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలనేది మొదటి షరతు, రెండో షరతు కుటుంబ వార్షికాదాయం 5 లక్షల రూపాయలకు పైబడి ఉంటేనే ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంటే.. తక్కువ చదువుకున్న గృహిణులు, తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ బీమా పరిధిలోకి రావు. ప్రమోర్ ఫిన్‌టెక్ సహ వ్యవస్థాపకురాలు నిషా సంఘవి మాట్లాడుతూ గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్‌ తీసుకోవటం కంటే.. వారి పేరు మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మహిళకు సంపాదన లేకుంటే బీమా తీసుకోవడంలో అర్థమే ఉండదు. కానీ మహిళకు ఇంటి బాధ్యతలు ఉంటే.. ఆమె ఒంటరి తల్లి అయి పిల్లల బాధ్యత ఉన్నప్పటికీ పని చేయకపోతే అలాంటి బీమా ఉండాలి. కానీ ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వడం తప్పనిసరి అయితే ఆమె ఈ రకమైన బీమాను తీసుకోలేరు.

ఇవీ చదవండి..

Oil Prices: యుద్ధం పేరుతో దోపిడీ మొదలైంది.. టీవీ9 నిఘాలో వెలుగులోకి సంచలన విషయాలు..!

రాత్రిపూట ఈ పండు తింటే ఆ ట్యాబ్లెట్‌ అవసరమే ఉండదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..