AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: మీ వద్ద ఉన్న బంగారం ఇతరులకు అమ్మితే ట్యాక్స్ కట్టాల్సిందేనా..? ఈ ఐటీ రూల్స్ చాలామందికి తెలియదు..

మీ వద్ద ఉన్న బంగారాన్ని ఇతరులకు అమ్ముతున్నారా..? ఇలాంటి సమయంలో విక్రయించడం ద్వారా వచ్చే లాభంపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా..? మొబైల్, ఫోన్, ల్యాప్ టాప్ లాంటివి అమ్మినా ట్యాక్స్ కట్టాల్సిందేనా..? అసలు ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనేది చూద్దాం.

Income Tax Rules: మీ వద్ద ఉన్న బంగారం ఇతరులకు అమ్మితే ట్యాక్స్ కట్టాల్సిందేనా..? ఈ ఐటీ రూల్స్ చాలామందికి తెలియదు..
Gold
Venkatrao Lella
|

Updated on: Aug 22, 2026 | 12:20 PM

Share

మీరు మీ పాత ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఫర్నిచర్, పాత్రలు వంటి రోజువారీ వస్తువులను అమ్ముతున్నారా..? వాటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంపై ట్యాక్స్ కట్టా్ల్సి ఉంటుందా? అనే విషయాలు చాలామందికి తెలియవు. ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి సామాన్యులకు పెద్దగా అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులకు గురవుతుంటారు. వీటికి ఎప్పుడు పన్ను విధిస్తారు..? ఎప్పుడు పన్ను మినహాయింపు ఉంటుంది? అనేది తెలుసుకోరు. అయితే ప్రతీ వస్తువుపై ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. కొన్ని వస్తువులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు అమ్మే వస్తువు, సంపాదించే ఆదాయాన్ని బట్టి నిబంధనలు మారాతాయి. ఏయే వస్తువులపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందనేది ఒకసారి చూద్దాం.

ల్యాప్‌టాప్, ఫోన్ అమ్మితే ట్యాక్స్ ఉంటుందా..?

మీరు మీ దగ్గర ఉన్న ఫోన్, ల్యాప్ టాప్, ఫర్నిచర్, కారు, స్కూటర్, బట్టలు, ఆభరణాలను అమ్ముతున్నారని అనుకుందాం. మీరు వీటిని కొనుగోలు చేసిన తర్వాత అధిక ధరలకు విక్రయిస్తే.. అప్పుడు వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం అంటారు. ఈ మూలధన లాభంపై పన్ను ఉంటుంది. అయితే కొన్ని వ్యక్తిగత వస్తువులకు పన్ను నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా కుటుంబసభ్యులు వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే వస్తువులపై పన్ను ఉండదు. దుస్తులు, ఫర్నిచర్, పాత్రలు, ఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు రోజువారీ అవసరాల కోసం ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీరు అమ్మినా.. వాటిపై వచ్చే లాభంపై ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. కార్లు, స్కూటర్లు, ఇతర వ్యక్తిగత వస్తువులను విక్రయించాన చెల్లించాల్సిన అవసరం లేదు.

బంగారం, వెండి అమ్మితే..

మీరు బంగారం, వెండి, ప్లాటినం లాంటి లోహాలతో తయారుచేసిన ఆభరణాలను అమ్మితే మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వ్యక్తిగత వస్తువుల కిందకు రావనే విషయం గుర్తించుకోవాలి. వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభంపై ట్యాక్స్ వర్తిస్తుంది. శిల్పాలు, చత్రాలు, కళాఖండాలు, పురావస్తు సేకరణ వస్తువులను కూడా విలువైన వస్తువులుగా పరిగణిస్తారు. దీంతో వీటిని విక్రయించినా ట్యాక్స్ అనేది ఉంటుంది. పాత్రలు, ఫర్నిచర్ లాంటి వస్తువుల్లో విలువైన రాళ్లు పొదిగి ఉంటే పన్ను కట్టాల్సి రావొచ్చు. విలువైన లోహాలు, రాళ్లతో పొదిగిన ఏదైనా వస్త్రాన్ని పన్ను నిబంధనల ప్రకారం ఆభరణంగా పరిగణించవచ్చు. దీంతో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. పాత వస్తువును అమ్మేటప్పుడు అది వ్యక్తిగత వస్తువుల వర్గంలోకి వస్తుందో లేదో ముందుగా తనిఖీ చేయండి.  బంగారం, ఇతర ఖరీదైన వస్తువుల విషయంలో కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పత్రాలను భద్రపర్చుకోండి.

Follow Us
చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరత.. రైతులు పాటించాల్సిన కీలక జాగ్రత్త
చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరత.. రైతులు పాటించాల్సిన కీలక జాగ్రత్త
పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు..
పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య..
BSNL బంపర్ ఆఫర్.. తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ
BSNL బంపర్ ఆఫర్.. తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ
కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు!
కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు!
పాకిస్థాన్ క్రికెట్‌కు దిమ్మతిరిగి పోయిందిగా..
పాకిస్థాన్ క్రికెట్‌కు దిమ్మతిరిగి పోయిందిగా..
ఆలయాన్నే టార్గెట్ చేసిన కేటుగాడు... ఒకే గుడిలో వరుస చోరీలతో కలకలం
ఆలయాన్నే టార్గెట్ చేసిన కేటుగాడు... ఒకే గుడిలో వరుస చోరీలతో కలకలం
కుజుడు, గురువు అనుగ్రహం.. ఈ రాశుల వారు స్థిరాస్తులు కొనే ఛాన్స్..
కుజుడు, గురువు అనుగ్రహం.. ఈ రాశుల వారు స్థిరాస్తులు కొనే ఛాన్స్..
అల్యూమినియం vs స్టీల్ కుక్కర్.. మీ వంటింటికి ఏది మంచిది..?
అల్యూమినియం vs స్టీల్ కుక్కర్.. మీ వంటింటికి ఏది మంచిది..?
మేడపైకి ఎక్కకుండానే ట్యాంక్‌లో నీరు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి!
మేడపైకి ఎక్కకుండానే ట్యాంక్‌లో నీరు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి!