Hyundai Car: రూ. 8.11 లక్షల హ్యుందాయ్ కారు.. రూ. 1.75 లక్షలకే.! ఫీచర్లు మీరూ చూసేయ్యండి.!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ దగ్గర కూడా ఓ కారు ఉండాలని అనుకుంటారు. లాంగ్ డ్రైవ్స్ అయినా, కుటుంబంతో ఏదైనా..

Hyundai Car: రూ. 8.11 లక్షల హ్యుందాయ్ కారు.. రూ. 1.75 లక్షలకే.! ఫీచర్లు మీరూ చూసేయ్యండి.!
Car
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2023 | 12:45 PM

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ దగ్గర కూడా ఓ కారు ఉండాలని అనుకుంటారు. లాంగ్ డ్రైవ్స్ అయినా, కుటుంబంతో ఏదైనా లాంగ్ టూర్ ప్లాన్ చేయాలనుకున్నా.. కారు ప్రయాణం చాలా సౌకర్యవంతం. మరి ఈ తరుణంలో మీరూ కారు కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. మీకోసం ఈ న్యూస్. హ్యుందాయ్ ఐ10 కారు భారీ డిస్కౌంట్‌తో మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. సాధారణంగా కొత్త హ్యుందాయ్ ఐ10 ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షలు కాగా.. అది ఇప్పుడు కేవలం రూ. 1.75 లక్షలకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రాండ్ i10 NIOS ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు, ఇది 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షల నుంచి రూ.8.11 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.1.75 లక్షలకే మీరు హ్యుందాయ్ ఐ10 పాత మోడల్‌ను మీరు పొందొచ్చు. కార్లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచాయి.

హ్యుందాయ్ i10 OLX:

హ్యుందాయ్ i10 2013 మోడల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో కేవలం రూ. 1.75 లక్షలకే అందుబాటులో ఉంది. ఈ కారు ఇప్పటి వరకు 58,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ i10 మోడల్ పెట్రోల్‌తో నడుస్తుంది. అలాగే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అమర్చబడి ఉంది. ఇది ఢిల్లీ సర్కిల్‌లో ఉంది.

హ్యుందాయ్ i10 స్పిన్నీ:

హ్యుందాయ్ i10 మరో ఆఫర్ Spinnyలో అందుబాటులో ఉంది. ఇక్కడ 2014 మోడల్ i10 కేవలం రూ.3.21 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనం ఇప్పటివరకు 55.2 వేల కిలోమీటర్ల ప్రయాణించింది. పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ కారు నోయిడా సర్కిల్‌లో అందుబాటులో ఉంది.

Hyundai i10 Cars24:

Cars24లో 2015 మోడల్ హ్యుందాయ్ ఐ10ని రూ.3.53 లక్షలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కారు 94,526 కిలోమీటర్లు నడిచింది. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్‌ అమర్చబడి ఉంది. కారు ఢిల్లీలో రిజిస్టర్ చేయబడగా.. అక్కడే ఇది అందుబాటులో ఉంది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.

1