SBI Balance Check : చిటికెలో మీ ఎస్‌బీఐ ఖాతాలోకి బ్యాలెన్స్ మీ ముందుకు.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి
ఇంతకుముందు వ్యక్తులు తమ ఖాతాల బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి పొడవైన క్యూలలో నిలబడేవారు. కానీ ప్రస్తుతం బ్యాంకుల వద్ద అలాంటి పరిస్థితులు లేవు. ప్రపంచం అభివృద్ధి చెందుతున్నందున, బ్యాంకులు కూడా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో వారి ఖాతాలను వివరాలను ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.

సాధారణంగా, బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు ఖాతాల వివిధ లక్షణాలను ట్రాక్ చేయడానికి సాంకేతికతను తీసుకురావడం ద్వారా భౌతిక రద్దీని తగ్గించడానికి బ్యాంకులు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. బ్యాంకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించి కొత్త పద్ధతులను ప్రయోగించే దిశగా కృషి చేస్తున్నాయి. ఇంతకుముందు వ్యక్తులు తమ ఖాతాల బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి పొడవైన క్యూలలో నిలబడేవారు. కానీ ప్రస్తుతం బ్యాంకుల వద్ద అలాంటి పరిస్థితులు లేవు. ప్రపంచం అభివృద్ధి చెందుతున్నందున, బ్యాంకులు కూడా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో వారి ఖాతాలను వివరాలను ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. దేశంలోని ప్రసిద్ధ సెమీ-ప్రైవేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మిస్డ్ కాల్స్ ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయడానికి కొన్ని సులభమైన చర్యలను తీసుకొచ్చింది. మీ ఎస్‌బీఐ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఉన్న చిట్కాలపై ఓ లుక్కేద్దాం.
మిస్‌డ్ కాల్‌తో బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
- మీ మొబైల్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి.
- అనంతరం 92237 66666 నెంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వాలి.
- అనంతరం బ్యాంక్ సందేశం కోసం వేచి చూడాలి.
- మీ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలతో మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
మీరు మిస్డ్ కాల్స్ ద్వారా ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడమే కాకుండా, మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలను తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి బీఏఎల్ అని టైప్ చేసి 92237 66666 కు పంపాలి . కొంత సమయం తర్వాత మీ ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది.
మినీ స్టేట్‌మెంట్ కావాలంటే ఇలా
మీరు మీ ఖాతాకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ను బ్యాంక్ నుంచి పొందాలనుకున్నా ఓ చిట్కా ఉంది. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 92238 66666 కు డయల్ చేస్తే మీ ఖాతకు సంబంధించి లావాదేవీల వివరాలను మెసేజ్ రూపంలో పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం