Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ALERT: మా ఖాతాలో రూ.295 ఇందుకే డిబిట్ అయ్యాయి.. సోషల్ మీడియాలో ఎస్‌బీఐ ఖాతాదరుల గగ్గోలు.. కారణం మాత్రం ఇదే..

చాలా మంది ఎస్‌బీఐ వినియోగదారులు తమ సేవింగ్స్ ఖాతాల నుంచి బ్యాంక్ రూ. 295 కట్ చేసిందని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లలో ఒక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు కారణం..

SBI ALERT: మా ఖాతాలో రూ.295 ఇందుకే డిబిట్ అయ్యాయి.. సోషల్ మీడియాలో ఎస్‌బీఐ ఖాతాదరుల గగ్గోలు.. కారణం మాత్రం ఇదే..
SBI
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 03, 2023 | 7:22 PM

SBI సేవింగ్ ఖాతాదారుల సూచన! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది వేలాది శాఖల ద్వారా వినియోగదారులను తమ సేవలను అందిస్తుంది. విస్తారమైన బ్రాంచ్ నెట్‌వర్క్‌లతో, బ్యాంక్ దేశంలోని గ్రామీణ, మధ్యతరగతి జనాభాకు విజయవంతంగా సేవలు అందిస్తోంది. SBI వారి ప్రధాన బ్యాంకింగ్ భాగస్వామిగా ఉంది. భారతీయ జనాభాలో ఎక్కువ మందిలో ఖాతాదారులు కలిగిన బ్యాంక్. అంతేకాదు నమ్మకానికి మరో కారణంగా కూడా చెప్పవచ్చు. SBI కోట్లాది మంది భారతీయులకు సేవలందిస్తోంది. దాని వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఇది కాలక్రమేణా మార్చుకుంటోంది.

తమ ఖాతాల నుంచి రూ. 295..

మార్చి నెల 2వ తేదీ చాలా మంది సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. తమ స్టేట్ బ్యాంక్  ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లుగా స్క్రీన్ షాట్లు పెట్టడం.. దానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయ్యిందని గగ్గోలు పెట్టారు. అయితే ఇలా డబ్బు కట్ అవ్వడం వెనుక ఓ కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోకపోవడం వల్లే డబ్బులు ఎందుకు కట్ అయ్యాయో బ్యాంకిక్ రంగ నిపుణులు వివరించారు. ఇంతకూ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్‌ల నుంచి డబ్బు కట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

చాలామంది ఎస్బీఐ ఖాతాదారులు మార్చి 2వ తేదీన తమ సేవింగ్స్ అకౌంట్ల నుంచి రూ. 295 కట్ అయ్యాయని అంటున్నారు. సాధారణంగా బ్యాంకులు సర్వీస్ ఛార్జెస్ పేరుతో ఖాతాల నుంచి డబ్బు కట్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఖాతాల నుండి కట్ అయిన కారణం వేరుగా ఉంది. NACH రూల్స్ కారణంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కట్ అయినట్లుగా తేలింది. నేషనల్ ఆటోమమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది ఎన్‌పీసీఏ ద్వారా ఏర్పాటు చేయబడింది.

ఇది రూ. 295 లెక్క..

ఎందుకు కట్ చేసిందనే దానికి ఓ లెక్క ఉంది. సాధారణంగా ఏదైనా లోన్ తీసుకున్నా, వస్తువు కొన్నా దానికి నెలవారి చెల్లింపు ఈఎంఐ కడుతుంటాం. అలా నెల వారి ఈఎంఐ కట్టడానికి నిర్ణీత తేదీ ఉంటుంది. ఆ తేదీలోపు మీ బ్యాంక్ ఖాతాలో ఈఎంఐకి సరిపడే డబ్బు ఉండాలి. అలా లేని పక్షంలో రూ. 250 ఫైన్ వేస్తారు. దీనికి 18శాతం GST గా 45రూపాయలతో కలిపి మొత్తం రూ.250 +రూ.45=రూ295 ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా నుంచి కట్ అవుతాయి. ఇలా ఖాతా నుంచి డబ్బు కట్ కాకుండా ఉండాలంటే నిర్ణీత ఈఎంఐ తేదీకి ఒకరోజు ముందే బ్యాంకు ఖాతాలలో డబ్బు ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!