Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

sebi: ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ రూపంలో ట్రేడింగ్‌.. మార్గదర్శకాలను జారీ చేసిన సెబీ

Gold Exchange: బంగారం ట్రేడింగ్‌పై  గోల్డ్‌ ఎక్సే్చంజీ ఏర్పాటుకు సంబంధించి సెబీ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. దేశీయంగా స్పాట్‌ మార్కెట్లో రేట్ల విధానం పారదర్శకంగా ఉండేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. వీటి ప్రకారం...

sebi: ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ రూపంలో ట్రేడింగ్‌.. మార్గదర్శకాలను జారీ చేసిన సెబీ
Follow us
Sanjay Kasula

|

Updated on: May 18, 2021 | 1:03 PM

బంగారం ట్రేడింగ్‌పై  గోల్డ్‌ ఎక్సే్చంజీ ఏర్పాటుకు సంబంధించి సెబీ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. దేశీయంగా స్పాట్‌ మార్కెట్లో రేట్ల విధానం పారదర్శకంగా ఉండేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. వీటి ప్రకారం ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ రూపంలో ట్రేడింగ్‌ చేయవచ్చు. 1 కిలో, 100 గ్రాములు, 50 గ్రాములు, కొన్ని నిబంధనలకు లోబడి 10 గ్రాములు, 5 గ్రాముల పసిడిని కూడా ప్రతిఫలించేలా ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (EGR)లో ఇకముందు ట్రేడ్‌ చేయొచ్చు.

సెబీ ఇంటర్మీడియరీలుగా వాల్ట్‌ మేనేజర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో బంగారం వినియోగించే భారత్‌లో.. గోల్డ్ ట్రేడింగ్, ఫిజికల్‌ డెలివరీ మొదలైన వాటన్నింటిలో పారదర్శకత తెచ్చేందుకు ఇది తోడ్పడుతుందని సెబీ పేర్కొంది.

బోర్స్‌లో వర్తకం చేయాల్సిన పరికరాన్ని ‘ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదు’ (ఇజిఆర్) అని పిలుస్తారు. అయితే మొత్తం లావాదేవీల యంత్రాంగాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చని రెగ్యులేటర్ సూచించారు.

సెబీ మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ముందుగా   భౌతిక రూపంలోని బంగారానికి సరిసమాన విలువ గల ఈజీఆర్‌(EGR)ను రూపొందిస్తారు. ఇందుకోసం వాల్ట్‌ మేనేజర్లు, డిపాజిటరీలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడిగా ఇంటర్‌ఫేస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని సెబీ సూచించింది.

ఇక రెండో దశలో ఈజీఆర్‌ను ఎక్సే్చంజీలో లిస్ట్‌ చేస్తారు. దీనికి సంబంధించి రోజువారీ సమాచారాన్ని డిపాజిటరీలు.. ఎక్సే్చంజీలకు తెలియజేస్తాయి. లావాదేవీలను క్లియరింగ్‌ కార్పొరేషన్‌ సెటిల్‌ చేస్తుంది.

చివరిగా మూడో విడతలో ఈజీఆర్‌ను మళ్లీ భౌతిక బంగారం రూపంలోకి మారుస్తారు. దీన్ని పొందడానికి కొనుగోలుదారు ఈజీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

వాల్టుల్లో భౌతిక రూపంలో బంగారం లేకుండా వాల్ట్‌ మేనేజర్లు.. ఈజీఆర్‌ను రూపొందించడానికి ఉండదు. మరింత మంది ఇన్వెస్టర్లను మార్కెట్లోకి ఆకర్షించే దిశగా స్వల్ప పరిమాణం.. 5 గ్రాములు, 10 గ్రాముల స్థాయిలోనూ ట్రేడింగ్‌ అనుమతించవచ్చని సెబీ తెలిపింది.

ఇవి కూడా చదవండి: Viral News: స్వీట్ల కోసం ఆరాటం.. లాక్ డౌన్ లో మెడ‌లో బోర్డు వేస‌కుని మ‌రీ పోరాటం

Marriage: పెళ్లి కోసం ఆ వరుడు అడిగిన వరకట్నం ఏమిటో తెలుసా? తెలిస్తే నువ్వు మామూలోడివి కాదు బ్రో అంటారు!

RAM Tweet: హీరో రామ్ ఇంట్లో విషాదం.. తాతయ్య‌ మృతిపై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన హీరో..