Whatsapp Scam: కేవైసీ పేరుతో రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు.. వెలుగులోకి వాట్సాప్ స్కామ్

పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు ఎన్ని సౌకర్యాలు తీసుకువస్తున్నాయో? అదే స్థాయిలో ముప్పును కూడా మోసుకొస్తున్నాయి. వాట్సాప్ కేవైసీ పేరుతో నయా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా డీఆర్‌డీఓ అధికారినే బోల్తా కొట్టించి కేటుగాళ్లు రూ.13 లక్షలు కొట్టేశారు. ఈ వాట్సాప్ కేవైసీ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Whatsapp Scam: కేవైసీ పేరుతో రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు.. వెలుగులోకి వాట్సాప్ స్కామ్
Follow us
Srinu

|

Updated on: Jan 05, 2025 | 4:00 PM

పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన 57 ఏళ్ల సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కేవైసీ స్కామ్‌కు బలయ్యారు. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి  కేటుగాళ్లు ఏకంగా రూ. 13 లక్షలు కొట్టేవారు.  వాట్సాప్ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేయాలని లేకపోతే వాట్సాప్ బ్లాక్ అవుతుందని వాట్సాప్ ద్వారా మోసగాళ్లు బాధితుడిని సంప్రదించారు. ఈ మేసేజ్‌లో హానికరమైన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని ఉండడంతో బాధితుడు తెలియకే ఆ ఏపీకే ఫైల్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయడంతో ద్వారా స్కామర్‌లు అతని స్మార్ట్‌ఫోన్‌కు రిమోట్ యాక్సెస్‌ను తీసుకుని బాధితుడి ఖాతా నుంచి రూ. 13 లక్షలు విత్‌డ్రా చేశాడు. 

తాను మోసమోయానని గుర్తించిన బాధితుడు ఎరవాడ పోలీస్ స్టేషన్‌ పోలీసులను ఆశ్రయించాడు. ముఖ్యంగా యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు బాధితుడికి బ్యాంక్ ప్రతినిధిగా పేర్కొంటూ ఒక వ్యక్తి సంప్రదించాడు, అతని కేవైసీ వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి తాము పంపే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని సూచిస్తూ అటాచ్‌మెంట్ పంపాడు. ఈ సందేశం నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిందని నమ్మించడానికి సీనియర్ అధికారిగా పేర్కొంటూ మరో వ్యక్తి ఫోన్‌లో మాట్లాడాడు. దీంతో బాధితుడు ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేయడం వల్ల ఆ అటాచ్‌మెంట్‌లో ఉన్న మాల్వేర్ ద్వారా తన ఫోన్‌ స్కామర్‌లు రిమోట్ యాక్సెస్‌ను పొందారు. అనంతరం బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము విత్ డ్రాకు వచ్చిన ఓటీపీలను హ్యాక్ చేసి స్కామర్లు మొత్తం రూ.12.95 లక్షలను కొట్టేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మోసగాళ్ల నుంచి రక్షణ పొందడం ఇలా

  • లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని మూలాల నుండి ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఏదైనా చర్య తీసుకునే ముందు నేరుగా మీ బ్యాంక్‌తో సందేశాలు లేదా ఈమెయిల్‌ల ప్రామాణికతను ధృవీకరించుకోవాలి. 
  • మీరు యాక్టివ్‌గా లావాదేవీలు చేయనప్పటికీ అందుకున్న వన్-టైమ్ పాస్‌వర్డ్‌లపై (OTPలు) ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. 
  • హానికరమైన అప్లికేషన్‌లను గుర్తించి బ్లాక్ చేయడానికి నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు