AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most expensive gift: ఎక్కడా తగ్గని ప్రధాని మోదీ.. అమెరికాకే అత్యంత ఖరీదైన బహుమతి

బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారికి బహుమతులు ఇవ్వడం మన సంప్రదాయం. వారితో మనకున్న స్నేహానికి, ఆత్మీయతకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. అలాగే విదేశాల్లో పర్యటన చేసేటప్పుడు మన ప్రతినిధులు అక్కడి పాలకులకు బహుమతులు అందిస్తూ ఉంటారు. దేశ ఘనతను ప్రతిబింబించేలా, అత్యంత ఖరీదైనవిగా అవి ఉంటాయి.

Most expensive gift: ఎక్కడా తగ్గని ప్రధాని మోదీ.. అమెరికాకే అత్యంత ఖరీదైన బహుమతి
Pm Modi On Rivers Interling
Nikhil
|

Updated on: Jan 05, 2025 | 4:15 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో అమెరికాలో పర్యటించారు. ఈ సమయంలో ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కు అత్యంత ఖరీదైన బహుమతి అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో అమెరికాలో పర్యటించారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆయన భార్య జిల్ బిడెన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్ బిడెన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20 వేల డాలర్లు విలువ జేసే వజ్రాన్ని బహూకరించారు. జో బిడెన్ కు చేతితో తయారు చేసిన గంధపు చెక్క పెట్టెను అందించారు. దానిలో వెండి వినాయక విగ్రహం, మరికొన్ని వస్తువులు ఉన్నాయి. 2023లో జో బిడెన్ దంపతులకు లభించిన బహుమతుల వివరాలను యునైటెట్ స్టేట్స్ చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ కార్యాలయం ఇటీవల వెల్లడించింది. వాటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించిన వజ్రం అత్యంత ఖరీదైనదని తెలిపింది.

ఈ వజ్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భూమి నుంచి తీసిన తరహాలోనే దీనికి గ్రీన్ డైమండ్ లక్షణాలు ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ, సౌర, పవన విద్యుత్తు ద్వారా ఆ వజ్రాన్ని తయారు చేశారు. కాగితపు గుజ్జుతో తయారు చేసిన చిన్న పెట్టెలో దాన్ని ఉంచి జిల్ బెడెన్ కు నరేంద్ర మోదీ అందించారు. 75 ఏళ్ల దేశ స్వాతంత్య్రం, స్థిరమైన అంతర్జాతీయ సంబంధాలను సూచించే ఒక గొప్ప వెలుగుకు ప్రతిరూపమే ఆ వజ్రమని వ్యాఖ్యానించారు. వివిధ దేశాల అధ్యక్షులు కూడా అమెరికా అధ్యక్షుడికి అనేక ఖరీదైన బహుమతులు అందించారు. వాటిలో ఇటీవల అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్ 7,100 డాలర్ల స్మారక ఫొటో ఆల్బమ్, మంగోలియన్ ప్రధాన మంత్రి 3,495 డాలర్ల మంగోలియన్ యోధుల విగ్రహం, బ్రూనై సుల్తాన్ 3300 డాలర్ల వెండి గిన్నె, ఇజ్రాయెల్ అధ్యక్షుడు 3,160 డాలర్ల స్లెర్లింగ్ సిల్వర్ ట్రే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యాదిమర్ జెలెన్స్కీ 2,400 డాలర్ల కోల్లెజ్ తదితర వాటిని అందజేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించిన వజ్రాన్ని జిల్ బెడెన్ వ్యక్తిగతంగా వాడుకోలేరు. అక్కడి చట్టం ప్రకారం.. బైడెన్ పదవీ విరమణ అనంతరం మార్కెట్ విలువ ప్రకారం ఆ వజ్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం మాత్రమే ఆమెకు ఉంటుంది. కానీ ఇలా అధిక ధర ఉన్న వస్తువులను కొనే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఏది ఏమైనా 2023లో అమెరికా అధ్యక్షుడు పొందిన ఖరీదైన బహుమతి మనదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి