SBI కస్టమర్లకు హెచ్చరిక.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకపోతే తిప్పలు తప్పవంటున్న బ్యాంకు..
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో దేశం అల్లాడిపోతుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరలకు
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో దేశం అల్లాడిపోతుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరలకు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. గత కొంత కాలంగా కేవైసీ అప్డేషన్ పేరుతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. దీంతో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లను హెచ్చరింది.
ఇటీవల ఎస్బీఐ కస్టమర్ ఒకరు సోషల్ మీడియా వేదికగా తనకు వచ్చిన మెసేజ్‌ను ఎస్బీఐ అధికారిక ఖాతాకు ట్యాగ్ చేస్తూ.. ఎవరు పంపారు చెక్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. అందులో మీ కేవైసీ అప్ డేట్ చేయండి. అప్ డేట్ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి అంటూ మెసేజ్ వచ్చింది. దీనిపై ఎస్బీఐ స్పందిస్తూ.. అలాంటి ఇమెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్ వంటివి వస్తే వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏదైనా కాల్స్, మెసేజ్ వస్తే.. తమ వ్యక్తిగత వివరాలతోపాటు.. బ్యాంక్ ఖాతా వివరాలను షేర్ చేయవద్దని.. ముఖ్యంగా యూజర్ ఐడి, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, పిన్ / సీవీవీ / ఒటీపీ వంటి వాటిని షేర్ చేయవద్దని.. ఒకవేళ షేర్ చేస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించింది. ఆలాంటి మెసేజ్ వస్తే.. వెంటనే report.phishing@sbi.co.in లో మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని SBI తెలిపింది. ఇది కాకుండా, మీరు హెల్ప్ లైన్ నంబర్ 155260 కి కూడా కాల్ చేయవచ్చుని తెలిపింది. స్థానిక బ్రాంచులలో కూడా ఫిర్యాదులు చేయవచ్చుని తెలిపింది.
ట్వీట్..
@TheOfficialSBI , please get this checked who is sending such false messages …. pic.twitter.com/6cwcOQ3DoG
— Pradeep Sacher (@pradeep_sacher) July 31, 2021
సైబర్ నేరగాళ్లు మొదటగా.. ఫిషింగ్, స్మిషింగ్ ద్వారా ప్రజల ఖాతాల నుంచి నగదు మాయం చేస్తారు. మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ.. కస్టమర్లకు బంపర్ ఆఫర్, అప్ డేట్ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లుగా చెబుతుంటారని.. తర్వాత మీ వివరాలను తెలుసుకుని మీ నగదు మాయం చేస్తారు.
ఎస్బీఐ సూచన.. 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల భద్రత కోసం ముందుగానే రక్షణ చర్యలు చేపట్టింది. ఎస్బీఐ ప్రకారం పుట్టినతేదీ, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి సమాచారాన్ని ఫోన్ కాల్, మెసేజ్ లేదా మెయిల్ ద్వారా తెలియజేయవద్దు. 2. ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ కార్యాలయం, పోలీసులు లేదా కేవైసీ అధికారిగా నటిస్తూ.. సైబర్ నేరగాళ్లు మెసేజ్ లేదా ఇమెయిల్ చేయవచ్చు. ఇలాంటి వాటికి మీ వివరాలను షేర్ చేయకూడదు. 3. ఏదైనా తెలియని లింక్స్ నుంచి యాప్స్ గురించి అస్సలు డౌన్ లోడ్ చేయకూడదు. ఇలాంటి యాప్స్.. టెలిపోన్ కాల్స్, ఇమెయిల్ వంటి వాటిపై ఆధారపడి ఉంటాయి. 4. ఒకవేళ తెలియని లింక్ నుండి సందేశం లేదా ఇమెయిల్ వచ్చినట్లయితే.. లింక్‌పై క్లిక్ చేయమని చెబితే అస్సలు చేయకూడదు. 5. సోషల్ మీడియా ద్వారా వచ్చే మెసేజ్, ఆఫర్లను అస్సలు నమ్మకూడదు.