SBI కస్టమర్లకు హెచ్చరిక… బ్యాంక్ నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు

SBI కస్టమర్లకు హెచ్చరిక... బ్యాంక్ నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు...
SBI: ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను ప్రవేశపెడుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలుతో పాటు వాహనాలకు సంబంధించిన లోన్లు, బంగారు రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలపై కూడా ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఇక తాజాగా పండగ సీజన్‌ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్‌ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కారు లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 8:54 PM

దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందించడంలో ఈ బ్యాంక్ ముందుంటుంది. ఇండియాలోనే ఈ బ్యాంకు కస్టమర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే తాజాగా ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. బ్యాంక్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవాలని సూచిస్తుంది. బ్యాంక్ ఇప్పటికే అనేక నియమాలను విడుదల చేసింది. ఎస్బీఐ ప్రవేశ పెట్టిన నియమాలను పాటించకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోలేరు. అందుకే ముందుగానే నియమాలను తెలుకోవాలని హెచ్చరిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్లు డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని పరిమితులను నిర్ణయించింది. హోం బ్రాంచ్, ఇతర బ్రాంచులకు వేర్వేరు పరిమితులను రివీల్ చేసింది. డబ్బు విత్ డ్రా, చెక్ ద్వారా విత్ డ్రా చేసుకోనే నియమాలలో కొన్ని మార్గనిర్ధేశకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల ఎస్బీఐ ఖాతాదారుడు ట్విట్టర్ వేదికగా.. విత్ డ్రా లిమిట్స్ గురించి ఎస్బీఐని ప్రశ్నించాడు. ఇందుకు ఎస్బీఐ స్పంధిస్తూ… ఇతర బ్రాంచుల నుంచి రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని.. తెలిపింది. నాన్ హోమ్ బ్రాంచ్ ద్వారా చెక్ ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవడాన్ని ఎస్బీఐ రెట్టింపు చేసింది. ఇంతకు ముందు ఇతర బ్రాంచుల నుంచి కేవలం రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు లక్ష రూపాయాల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే విత్ డ్రా స్లిప్ నుంచి రూ.25వేల వరకు పరిమితి ఉంది.

ట్వీట్..

ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలలో నాలుగు సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగు సార్లు విత్ డ్రా లిమిట్ ముగిసిన తర్వాత మరోసారి మీరు మనీ తీసుకోవడానికి అదనంగా రూ.15 తోపాటు.. జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రతి వినియోగదారునికి 10 పేజీల చెక్ బుక్ ఇవ్వనున్నట్లుగా ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ మరోక చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే రూ. 40 తోపాటు.. జీఎస్టీ చెల్లించాలి. అదే 25 పేజీల చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే.. రూ.75 చెల్లించాలి. అత్యవసర చెక్ బుక్ కావాలంటే రూ. 50తోపాటు.. జీఎస్టీ చెల్లించాలి.

Also Read: CM KCR Review: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. నీటి పారుదల ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష

‘నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారు’.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్