Home Loans: హోమ్ లోన్లపై ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఆ ఒక్కటీ ఉంటే చాలు..
ఒకవేళ మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే లోన్ల మంజూరు కష్టతరం అవడంతో పాటు వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఈక్రమంలో దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ శుభవార్తను ప్రకటించింది. అధిక సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీపై హోమ్ లోన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందా అని వెతుకుతున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మీ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అవసరమైన హోమ్ లోన్ ను అతి తక్కువ వడ్డీకి పొందుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అదెలా అంటే మంచి సిబిల్ స్కోర్ ను కలిగి ఉండటం. సాధారణంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే ఈ లోన్లు మంజూరవుతూ ఉంటాయి. అధిక సిబిల్ స్కోర్ ఉంటే సులభంగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తారు. హోమ్ లోన్ మంజూరు సమయంలోనూ దీనిని బ్యాంకర్లు తనిఖీ చేస్తారు. ఒకవేళ మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే లోన్ల మంజూరు కష్టతరం అవడంతో పాటు వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఈక్రమంలో దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ శుభవార్తను ప్రకటించింది. అధిక సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీపై హోమ్ లోన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సిబిల్ స్కోర్ అంటే..
సిబిల్ స్కోర్ అంటే వ్యక్తుల క్రెడిట్ చరిత్ర. అంటే మీ పాత లోన్లు, వాటి చెల్లింపులు, మీ రాబడులు, ఖర్చులు వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక. మీ క్రెడిట్ క్రమశిక్షణ ఆధారంగా సిబిల్ అనే ఏజెన్సీ మీకు స్కోర్ ఇస్తుంది. అది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్ పై రుణ ఆమోదం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక వడ్డీ కూడా తక్కువ పడుతుంది. మీకు కనుక 750కి పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మీకు సులభంగా హోమ్ లోన్ మంజూరు చేస్తుంది. అంతేకాతక తక్కువ వడ్డీని విధిస్తుంది.
ఎస్బీఐ వడ్డీ రేట్లు..
- మీ సిబిల్ స్కోర్ 550-649 మధ్య ఉంటే మీకు వడ్డీ రేటు 9.65 శాతం పడుతుంది.
- మీ సిబిల్ స్కోర్ 650-699 మధ్య ఉంటే బ్యాంక్ ఎలాంటి తగ్గింపును అందించడం లేదు. ప్రభావవంతమైన రేటు 9.45 శాతంగా ఉంటుంది.
- మీ సిబిల్ స్కోర్ 700-749 మధ్య ఉంటే 10 బీపీఎస్ తగ్గింపును అందిస్తోంది. అప్పుడు వడ్డీ రేటు 9.35 శాతంగా ఉంటుంది.
- మీ సిబిల్ స్కోర్ 750-800 మధ్య ఉంటే హోమ్ లోన్ వడ్డీ 30 బీపీఎస్ రాయితీతో 9.15 శాతంగా ఉంటుంది.
- ఒక వేళ మీ సిబిల్ స్కోర్ 101-150 నుంచి 151-200 మధ్య ఉంటే బ్యాంక్ మిమ్మల్ని ‘న్యూ టు క్రెడిట్’ రుణగ్రహీతల కేటాగిరిలోకీ తీసుకొని, 101-150 స్కోర్ 9.45 శాతం, 151-200 స్కోర్ కు 9.35 వడ్డీ రేటు విధిస్తుంది.
సిబిల్ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?
సిబిల్ ఎటువంటి ఛార్జీ లేకుండా సంవత్సరానికి ఒక నివేదికను అందిస్తుంది. అది ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
- అధికారిక సిబిల్ వెబ్‌సైట్ https://www.cibil.com/ కి వెళ్లండి.
- గెట్ యువవ్ సిబిల్ స్కోర్ ఆప్షన్ ను ఎంచుకోండి.
- మీ ఉచిత వార్షిక సిబిల్ స్కోర్‌ను పొందడానికి ‘ఇక్కడ క్లిక్ చేయండి’పై క్లిక్ చేయండి.
- మీ పేరు, ఇ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. ఐడీ రుజువు (పాస్‌పోర్ట్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ లేదా ఓటర్ ఐడీ) జత చేయండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయండి.
- ‘అంగీకరించి కొనసాగించు’పై క్లిక్ చేయండి.
- మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పొందుతారు. దానిని ఎంటర్ చేసి, ‘కొనసాగించు’ ఎంచుకోండి.
- ‘గో టు డాష్‌బోర్డ్’ ఎంచుకొని, మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి.
- మీరు myscore.cibil.com అనే వెబ్‌సైట్‌కి వెళ్తారు.
- ‘సభ్యుని లాగిన్’పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత, మీరు మీ సిబిల్ స్కోర్‌ను చూడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..